Sreeleela: సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ చాలు, లైఫ్ మారిపోవడానికి. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హిట్ కొట్టే దమ్ము ఉంది అని టాక్ తెచ్చుకుంటే చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నాలుగు ఆఫర్లు వచ్చే సరికి తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తారు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అలాగే తన రెమ్యునరేషన్ ను దారుణంగా పెంచేసింది.

నిజానికి ‘ఉప్పెన’ విడుదలకు ముందే కృతి శెట్టికి ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతలో కృతికి మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. ఇక మిగతా రెండు సినిమాలతో పని లేకుండా కృతికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కృతి చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అలాగే మరో మూడు సినిమాలకు సైన్ చేయడానికి ఒప్పుకుంది. అంటే.. కృతి చేతిలో మొత్తం 7 సినిమాలున్నాయి.
Also Read: మూవీ టైమ్ : ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !
ఈ రేంజ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ మరొకరు లేరు. దాంతో మీడియం రేంజ్ సినిమాలకు కృతి అందుబాటులో లేకుండా పోయింది. పైగా ఒక్కో సినిమాకి 2 కోట్లు రూపాయలు తీసుకుంటుంది. అందుకే, కృతితో సినిమాలు ప్లాన్ చేసుకున్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అన్నీ.. కృతి ప్లేస్ లో శ్రీలీలతో సరిపెట్టుకుంటున్నాయి. ‘పెళ్లి సందడ్’ అనే చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ‘శ్రీలీల’లో మ్యాటర్ ఉంది.

పైగా ఆ సినిమా బీసీ సెంటర్లలో బాగానే ఆడింది అని టాక్ ఉంది. పైగా గ్లామర్ విషయంలో శ్రీలీలకి ఫుల్ నేమ్ వచ్చింది. దాంతో, శ్రీలీల ఖాతాలో కొత్తగా నాలుగు చిత్రాలు వచ్చి పడ్డాయి. వరుసగా తనకు ఆఫర్లు వచ్చేసరికి ఈ భామకు ఏమి చేయాలో ఎంత అడగాలో అర్థం కావడం లేదు. దాంతో గుడ్డిగా కృతి శెట్టిని ఫాలో అయిపోతుంది. కాకాపోతే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం కోటి మాత్రమే అడుగుతోంది.
పైగా శ్రీలీల ప్రస్తుతం రవితేజ సరసన ‘ధమాకా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సితార సంస్థలో రెండు చిత్రాలకు ఆమె సైన్ చేసింది. మరో నిర్మాత దిల్ రాజు కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ రోడ్లపై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్..