https://oktelugu.com/

అప్పటి సీక్రెట్స్ : సిల్క్ స్మితతో ప్రొడక్షన్ బాయ్స్ నుండి సూపర్ స్టార్స్ వరకూ.. !

శృంగార తార సిల్క్ స్మిత. నిన్నటి తరాన్ని.. మైకంలో పడేసి పదేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన నిజమైన శృంగార రంగుల తార. ఎక్కడో ఏలూరులోని కొవ్వలి అనే ఓ చిన్న పల్లెటూరులో జన్మించింది. తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే స్కూల్ మాన్పించి పనిలో పెట్టారు. పైగా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అక్కడ భర్త, అత్తమామల వేధింపులు.. కొత్తగా వచ్చిన బాధలను భరించలేకపోయింది. దాంతో కొత్త జీవితాన్ని వెతుకుంటూ చెన్నై రైల్ ఎక్కింది. కాలం […]

Written By:
  • admin
  • , Updated On : December 12, 2020 / 11:17 AM IST
    Follow us on


    శృంగార తార సిల్క్ స్మిత. నిన్నటి తరాన్ని.. మైకంలో పడేసి పదేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన నిజమైన శృంగార రంగుల తార. ఎక్కడో ఏలూరులోని కొవ్వలి అనే ఓ చిన్న పల్లెటూరులో జన్మించింది. తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే స్కూల్ మాన్పించి పనిలో పెట్టారు. పైగా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అక్కడ భర్త, అత్తమామల వేధింపులు.. కొత్తగా వచ్చిన బాధలను భరించలేకపోయింది. దాంతో కొత్త జీవితాన్ని వెతుకుంటూ చెన్నై రైల్ ఎక్కింది. కాలం కలిసి వచ్చింది. కొన్నాళ్లకే వెండితెరను ఏలే శృంగార దేవతగా ఓ వెలుగు వెలిగింది. కానీ ఏ తుఫాన్ దాడి చేసిందో.. ఆ వెలుగు మధ్యలోనే ఆరిపోయింది.

    Also Read: ఎన్నో సమస్యలు.. ఎట్టకేలకు ఇప్పటికీ రిలీజ్ ఫిక్స్ !

    అయితే ఆ వెలుగులో చలి కాచుకున్న వ్యక్తులు అనేకమంది. వారిలో ప్రొడక్షన్ బాయ్స్ నుండి సూపర్ స్టార్స్ వరకూ ఉన్నారంటే.. సినిమా ఇండస్ట్రీ ఎంతో విచిత్రమైనది అనిపిస్తోంది. షూటింగ్ అయిపోయిన తర్వాత సిల్క్ స్మితకు బండి లేకుండా చేసి అక్కడే ఉంచేవారట ప్రొడక్షన్ వాళ్లు. ఇక అందరూ వెళ్లిపోయాక ఆమెను శారీరకంగా వేధించేవారట. దీనికితోడు ప్రొడ్యూసర్లు సాయంత్రం కాగానే అందరినీ పంపించేసి సిల్క్ స్మితను మాత్రమే ఉంచండి అనేవారట. పార్టీ ఉంది అంటూ ఆమెకు రెండు పెగ్గులు వేయించేవారని.. ఇక ఆ తర్వాత ఆమెను ఆట బొమ్మను చేసేవారు. జరుగకూడనిది జరిగేది. నిర్మాతతో పాటు ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్లు కూడా
    ఆమెను ఇబ్బంది పెట్టేవారట.

    Also Read: మహేష్ కోసం అనిల్ కపూర్ ను ఒప్పించిన నమ్రతా !

    ఓ దశలో.. ఓ మనిషిని సంతోష పెడుతున్నాను.. అని సిల్క్ స్మిత తనకు తానే నచ్చచెప్పుకునేది అట. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ వడ్లపాటి. 450 పైగా సినిమాలలో నటించినా చివరకు ఆమె జీవితం బాధాకరం. 35 ఏళ్లకే చనిపోయింది. వాస్తవానికి మంచి ఆర్టిస్ట్ కావాలన్నది స్మిత కోరిక అట. తమిళంలో వందిచక్రం అనే సినిమాలో సిల్క్ స్మిత అనే బార్ డాన్సర్ గా గ్లామర్ పాత్ర చేసింది. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో.. ఇక అప్పటినుంచీ దర్శక నిర్మాతలు ఆమెకు అలాంటి పాత్రలే ఇచ్చారు. ఇష్టం లేకున్న వరుసగా అలాంటి పాత్రలే చేసిందట. హీరోలలో కమల్ హాసన్, చిరంజీవి పక్కన చేయడం ఆమెకు బాగా నచ్చుతుందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags