కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్స్: నేడు, రేపు కూడా..

తెలంగాణలో భూములు క్రయ, విక్రయాలు జరిపే వారు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పటి వరకు కేవలం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే సాగుతుండగా తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వ్యవయాసేతర ఆస్తుల రిజిస్రేషన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్ స్లాట్ బుకింగ్ ను ప్రారంభించారు. దీంతో మొదటి రోజు 4,143 స్లాట్ బుకింగ్స్ జరిగాయి. Also Read: ఆ […]

Written By: NARESH, Updated On : December 12, 2020 1:10 pm

Land in Telangana

Follow us on

తెలంగాణలో భూములు క్రయ, విక్రయాలు జరిపే వారు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తానికి ప్రారంభమైంది. ఇప్పటి వరకు కేవలం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే సాగుతుండగా తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వ్యవయాసేతర ఆస్తుల రిజిస్రేషన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్ స్లాట్ బుకింగ్ ను ప్రారంభించారు. దీంతో మొదటి రోజు 4,143 స్లాట్ బుకింగ్స్ జరిగాయి.

Also Read: ఆ మంత్రులపై వేటుకే.. కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం ప్రకారం ధరణి వెబ్ సైట్ ద్వారా వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు క్రయ, విక్రయాలు చేసుకునేవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీసేవ కేంద్రంలో రూ. 200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. రోజుకు 24 స్లాట్స్ మాత్రమే బుకింగ్ అవుతాయి.

కాగా శుక్రవారం ప్రారంభమైన స్లాట్ బుకింగ్ తో ప్రభుత్వానికి రూ.85 లక్షల ఆదాయం లభించింది. శనివారం, ఆదివారం సెలవులను రద్దు చేసిన అధికారులు ఈరోజుల్లో కూడా అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు, అధికారులు శని, ఆదివారాలు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని సీఐజీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వానికి ఈ రెండు రోజుల్లో కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

Also Read: చివరి అంకానికి చేరిన టీపీసీసీ ఎంపిక.. రేసులో ఆ ఇద్దరు ఎంపీలు?

ఇక బిల్డర్లు, డెవలపర్ల కోసం పోర్టల్ లో ప్రత్యేకంగా విండో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 451 మంది బిల్డర్లు 93 వేలకు పైగా కొత్త ఆస్తులను అప్ లోడ్ చేశారు. రూ. 12,699 టిపిన్స్ ను స్థానిక సంస్థలు కేటాయించాయి. పోర్టల్ ద్వరా సులువుగా డాక్యుమెంట్ కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. ధరణిపై గత కొంత కాలంగా కోర్టులో సాగిన విచారణ తరువాత చివరికి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభమైంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్