చిత్తూరు జిల్లాకు చెందిన వివాదాస్పద మాజీ జడ్జి రామకృష్ణ మళ్లీ అరెస్టు అయ్యారు. ఓ పెన్షనర్ సంతకాలను ఫోర్జరీ చేసి, మోసం చేశారనే అభియోగంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణతోపాటు ఆయన కుమారుడు వంశీకృష్ణను కూడా మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: ఆ మంత్రి ఇలాఖాలో ఇష్టారాజ్యమా?!
బంధువు సంతకాలనే..!
తప్పుడు సంతకాలతో డబ్బులు కాజేశారని మదనపల్లి కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. సదరు బాధితురాలు సుచరితమ్మ.. రామకృష్ణ కు సొంత చిన్నమ్మ కావడం గమనార్హం. రామకృష్ణ, ఆయన కుమారుడిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం వీరిని పీలేరు సబ్ జైలుకు తరలించారు.
Also Read: ‘గ్రేటర్ సీమ’ ఉద్యమం ఎక్కడిదాక?
గతంలోనూ వివాదాలే..
మాజీ జడ్జి రామకృష్ణ గతంలో పలు వివాదాలకు కేంద్రమయ్యారు. ఇటీవల.. ఆయన మంత్రి పెద్దిరెడ్డి చంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా.. బీసీ నాయకుడు, రిటైర్డ్ జడ్జి ఈశ్వరప్ప ఆడియో వాయిస్ రికార్డు చేయడం సంచలనం కలిగించింది. ఇప్పుడు.. ఆయనే చీటింగ్ కేసులో ఇరుక్కోవడం విస్మయం కలిగిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్