Homeఆంధ్రప్రదేశ్‌Unknown Facts about NTR: కళ, రాజకీయాలపై ఆసక్తి.. ఉద్యోగం, లంచగొండితనపై విరక్తి.. ఇదీ ఎన్టీఆర్‌...

Unknown Facts about NTR: కళ, రాజకీయాలపై ఆసక్తి.. ఉద్యోగం, లంచగొండితనపై విరక్తి.. ఇదీ ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం

Unknown Facts about NTR: తెలుగు సినిమా దిగ్గజాలైన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌),కొంగర జగ్గయ్య 1947లో ఒకరికొకరు సన్నిహితంగా ఉండేవారు. దిగు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్‌.. జగ్గయ్యతో కలిసి నాటకాలు వేసేవారు. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదవు పూర్తి కాగానే సబర్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఉద్యోగం సాధించాడు. అయితే ఆ ఉద్యోగం ఎన్నో రోజులు చేయలేదు. ఉద్యోగం కారణంగా తన కళ చచ్చిపోతుందని భావించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జగ్గయ్యకు ఒక లేఖ రాశారు.

1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించిన సమయంలో ఎన్టీఆర్, జగ్గయ్య ఇద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ప్రారంభ దశలో ఉన్నారు. ఎన్టీఆర్‌ అప్పటికి సినిమా రంగంలో అడుగుపెట్టే సన్నాహాలు చేస్తుండగా, జగ్గయ్య విద్యావేత్తగా, నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇద్దరూ స్నేహితులుగా ఉండేవారు. వారి మధ్య జరిగిన సంభాషణలు తరచూ లేఖల రూపంలో ఉండేవి.

లేఖ ఉద్దేశం..
ఎన్టీఆర్‌ జగ్గయ్యకు రాసిన లేఖలో, స్వాతంత్య్రోద్యమం తర్వాత దేశంలో ఏర్పడిన కొత్త అవకాశాల గురించి, తెలుగు సినిమా రంగంలో తమ భవిష్యత్తు గురించి చర్చించారు. ఉద్యోగం కారణంగా కళకు దూరమవుతున్నానని అందులో పేర్కొన్నారు. మీ గురించి కూడా ఎలాంటి సమాచారం తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ లేఖ అందిన వెంటనే రిప్లై ఇవ్వాలని తాను సినిమా రంగంలోని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ లేఖలో ఎన్టీఆర్‌ తన ఆశయాలను, సినిమా ద్వారా సమాజంపై ప్రభావం చూపాలనే తపనను వ్యక్తపరిచారు. ఈ లేఖ తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఆధారంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, ఇది ఎన్టీఆర్‌ మరియు జగ్గయ్యల మధ్య స్నేహ బంధాన్ని, అలాగే ఆ కాలంలో తెలుగు సినిమా రంగంలో జరుగుతున్న పరిణామాలను వెల్లడిస్తుంది. ఈ లేఖ ద్వారా ఎన్టీఆర్‌ విజన్, సినిమా పట్ల ఆయన అంకితభావం స్పష్టమవుతాయి. మరోవైపు లేఖలో లాంచాల గురించి పేర్కొన్నారు. లంచాలను వ్యతిరేకించారు.

ఎన్టీఆర్, జగ్గయ్య సహకారం
తరువాత కాలంలో ఎన్టీఆర్, జగ్గయ్య కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఉదాహరణకు, ’పల్లెటూరి పిల్ల’ (1950) వంటి చిత్రాల్లో జగ్గయ్య ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశారు. ఈ లేఖ వారి స్నేహానికి, సహకారానికి ఒక పునాదిగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ లేఖలో బెజవాడ పేరును Bezwada అని, తన పేరును రావు(Row) అని పేర్కొన్నారు.

1983లో రాజకీయ ప్రవేశం..
ఇక ఎన్టీఆర్‌ 1983లో రాజకీయప్రవేశం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే సంచలనంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. అయితే అదే సమయంలో హార్ట్‌ సర్జరీ కోసం అమెరికా వెళ్లారు. అయనకు అమెరికాకు చెందిన

ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం గురించి యు.ఎస్‌. హార్ట్‌ సర్జన్‌ ఏమన్నారు?
1984లో సీఎంగా ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు వైద్యులు గుండె సమస్య ఉందని తెలిపారు. దీంతో జూలైలో మరోమారు వెళ్లి బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. అప్పట్లో ఈ సర్పరీని ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ డెంటర్‌ పూలి. ఆయన టెక్సాస్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసేవారు. ప్రపంచంలో తొలి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. అయితే ఎన్టీఆర్‌ అమెరికాలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంక్షోభం మొదలైంది. అదే ఆగస్టు సంక్షోభంగా ముద్ర పడింది. నాదేండ్ల భాస్కర్‌ తిరుగుబాటు చేశారు. పార్టీని చీల్చారు. సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన ఎన్టీఆర్‌ వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు. హార్ట్‌ సర్జరీ తర్వాత ఎనిమిది వారాల కనీస విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా.. మొండివాడైన ఎన్టీఆర్‌ మాత్రం పెద్ద యుద్ధమే చేశాడు. ప్రతీరోజు జనంలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తగా బస్సు యాత్ర చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవనం ఎదుట బలప్రదర్శన చేశారు. చివరకు విజయం సాధించారు. దీంతో మళ్లీ సీఎం పదవి చేపట్టారు. అమెరికాలో ఉన్న డెంటర్‌ పూలీ.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం గురించి ఎన్టీఆర్‌ ద్వారా తెలుసుకన్నారు. సాధారణంగా వారికి రాజకీయాలపై ఆసక్తి ఉండదు. కానీ, ఎన్టీఆర్‌ డాక్టర్‌ పూలీపై గాఢమైన ముద్ర వేశారు. 1984 అక్టోబర్‌ 29 లేఖ రాశారు. పేషంట్‌గానే కాకుండా వ్యక్తిగా తన అభిమానం చాటుకున్నాడు. ఇందిరాగాంధీ స్థానం భర్తీ చేయగల వ్యక్తి మీరే అని తాను గమనించిన రాజకీయాలను భట్టి అర్థమైంది. మీ అభిమానిగా ఈ విషయం చెప్పాను అని పేర్కొన్నారు.

ఈ రెండు ఉదంతాలు. ఒక కళాకారుడిగా, ఒక రాజకీయ నాకుడిగా ఎన్టీఆర్‌ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular