WTC 2025-27 Schedule: రెండుసార్లు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచే దశలో ఓడిపోయింది. మూడోసారి అసలు ఫైనల్ దాకా కూడా వెళ్లలేకపోయింది. ఇది ఒక రకంగా బీసీసీఐకి నామర్ద లాంటి వ్యవహారం. అందువల్లే జాగ్రత్తగా నరుక్కుంటూ వచ్చింది. ప్లేయర్ల మీద పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదు గాని.. ప్రణాళికలు మాత్రం అమలు చేసుకుంటూ రావడం మొదలుపెట్టింది. ముందుగా రంజీలో ఆడాలని అందరి ఆటగాళ్లకు కండిషన్ పెట్టింది. కొన్ని రకాల షరతులు కూడా విధించింది. అందరికీ ఈ వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలోనూ కాస్త కఠినంగానే వ్యవహరించడం మొదలుపెట్టింది. మొత్తంగా గట్టి ప్రణాళికను రూపొందించి.. రియాల్టీలో పెట్టేసింది. ఇది ఒక రకంగా శుభ పరిణామం. అయితే బీసీసీఐ అక్కడితోనే ఆగిపోలేదు. జట్టులోకి కొత్త రక్తం రావాలి.. కొత్త ఆటగాళ్లు రావాలి. అనే ఉద్దేశంతో బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే 2025లో జరిగే అన్ని టెస్ట్ సిరీస్ లకు ముందుగానే పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది.
సాధారణంగా టెస్ట్ కికెట్ అనేది సుదీర్ఘంగా సాగుతుంది. కాకపోతే ఒక ఆటగాడి సత్తా మొత్తం ఇందులోనే తెలిసిపోతుంది. గంటల తరబడి మైదానంలో ఉండడం.. వందలాది బంతులను ఎదుర్కోవడం.. అదే సమయంలో వందలాది బంతులను వేయడం.. ఆ బంతులను అడ్డుకోవడం.. అంత ఈజీ ప్రక్రియ కాదు. ప్రస్తుతం క్రికెట్ ను టి20 దున్నేస్తున్న సమయంలో ఆటగాళ్లకు ఆ స్థాయి ఓపిక రావాలి అంటే చాలా శ్రమ అవసరం. అయితే అలాంటి ఓపిక ఉన్న ప్లేయర్లను ఎంచుకోవడానికి బీసీసీఐ భారీ కసరత్తు చేసింది. థి సీజన్లో టీమిండియా ఆడే టెస్ట్ మ్యాచ్లకు ముందు.. భారత ఏ జట్టుతో అనధికారికంగా టెస్ట్ మ్యాచ్లు ఆడిస్తోంది. దీనికోసం పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది.
త్వరలో టీమిండియా ఇంగ్లీష్ దేశంలో పర్యటిస్తుంది. అక్కడ ఐదు టెస్టులు ఆడుతుంది. దానికంటే ముందు భారత ఏ జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తుంది. ఇంగ్లాండ్ లయన్స్ తో రెండు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత ఇండియా సీనియర్ జట్టుతో భారత ఏ జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇవన్నీ కూడా నాలుగు రోజులపాటు జరుగుతాయి. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో భారత ఏ జట్టు రెండు అనధికారిక టెస్టులు ఆడుతుంది. ఇక ఆస్ట్రేలియా ఏ జట్టుతో భారత ఏ జట్టు రెండు అనధికారిక టెస్టులు ఆడుతుంది. వాటిల్లో ప్రతిభను చూపించిన ప్లేయర్లను జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇండియా ఏ టీం ఈ ఏడాది 7 మల్టీ డే మ్యాచ్ లను ఆడటం విశేషం. అంటే ఈ లెక్కన ప్రతిభావంతమైన క్రికెటర్లను జాతీయ జట్టులోకి తీసుకోవడానికి బీసీసీఐ సెలక్షన్ కమిటీకి ఆస్కారం ఏర్పడుతుంది.