KBR Park: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు సందర్శకులతో సందడిగా ఉంటుంది. ఎప్పుడు ప్రజలతో కళకళలాడుతుంటుంది. ఇలాంటి చోట దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అంశాలపై అందరిలో భయం పట్టుకుంది. పార్కుల్లో కూడా పటిష్ట భద్రత లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో టాలీవుడ్ నటి, మోడల్ షాలూ చౌరాసియా పై జరిగిన దాడితో అందరు ఉలిక్కిపడ్డారు.

జాగింగ్ చేస్తున్న నటి చౌరాసియాపై దుండగుడు అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. పెనుగులాటలో ఆమెకు గాయాలయ్యాయి. ఆగంతకుడు ఆమె ఫోన్ లాక్కుని పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన ఆమె కేకలు వేయగా దుండగుగు పారిపోయాడు. దీంతో ఆమె బయటకు వచ్చి స్థానికుల సాయంతో 100కు ఫోన్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ పుటేజీల ద్వారా నిందితుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన కేబీఆర్ పార్కులో ఇలాంటి దాడులు గతంలో సైతం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. పార్కుకు వచ్చే వారి రక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్కులోనే దాడికి తెగబడటం చూస్తుంటే నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Bigg Boss 5 Telugu: వరల్డ్ వైడ్ ట్విట్టర్ ట్రెండ్ లో మిస్టర్ కూల్
ఉదయం, సాయంత్రం వేళల్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు పార్కుకు వచ్చి వాకింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడపడం తెలిసిందే. నగరం నడిబొడ్డున ఉన్న పార్కులోనే రక్షణ ఇంత దిగజారిపోతే ఎలా అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. సెలబ్రిటీకే రక్షణ లేకపోతే మిగతా వారి సంగతి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read: Sara Alikhan: మాల్దీవ్స్ బీచ్ లో మల్టీ-కలర్ కార్టూన్ ప్రింట్ బికినీలో బీ టౌన్ బ్యూటీ