https://oktelugu.com/

Bigg Boss 8 : ‘బిగ్ బాస్ 8’ గ్రాండ్ ఫినాలే లో ఊహించని సర్ప్రైజ్ లు..6 మంది చీఫ్ గెస్ట్స్..టాప్ 3 కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్స్!

నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టేసింది. ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, అదే విధంగా సీజన్ 6 రేంజ్ లో డిజాస్టర్ ఫ్లాప్ కూడా కాదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 09:53 AM IST

    Bigg Boss 8

    Follow us on

    Bigg Boss 8 : నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టేసింది. ఈ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, అదే విధంగా సీజన్ 6 రేంజ్ లో డిజాస్టర్ ఫ్లాప్ కూడా కాదు. ఎదో అలా వెళ్లిపోయిందంటే. 5వ వారం నుండి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రావడం వల్ల డిజాస్టర్ దిశగా వెళ్తున్న సీజన్ 8 యావరేజ్ రేంజ్ లో వెళ్లిందని విశేషకుల అభిప్రాయం. ముఖ్యంగా గౌతమ్, అవినాష్, రోహిణి, తేజ వంటి వారు రావడం వల్లే సీజన్ కి కళ వచ్చిందని, లేకపోతే సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యేదని అంటున్నారు. గౌతమ్ రావడం వల్ల గేమ్ మొత్తం చేంజ్ అయ్యింది. అతని వల్ల నిఖిల్ & కో బ్యాచ్ గ్రూప్ గేమ్ మొత్తం ఆడియన్స్ కి అర్థమైంది. అంతే కాకుండా నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఫైట్స్ కూడా టీఆర్ఫీ పెరిగేందుకు కారణం అయ్యాయి.

    అదే విధంగా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ వంటి వారు అందించిన కామెడీ మామూలుది కాదు. ఈ సీజన్ లో హాట్ స్టార్ లైవ్ కి అత్యధిక వ్యూయర్షిప్ వచ్చిందట. అలాంటి రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం ఈ ముగ్గురే అని అంటున్నారు విశ్లేషకులు. ఆడియన్స్ తో పెద్దగా కనెక్షన్ లేని అవినాష్ టాప్ 5 లోకి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం అతనిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఈ చివరి వారం లో హాట్ స్టార్ లైవ్ అవినాష్ లేకపోతే ఎవ్వరూ చూడరు. అందుకే బిగ్ బాస్ టీం ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ముందుకు నెట్టిందని అంటున్నారు. అలా ఈ సీజన్ గడిచిపోయింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. శుక్రవారం అర్థ రాత్రి వరకు టైటిల్ విన్నర్ ఓటింగ్స్ జరగబోతున్నాయి. ట్రోఫీ నిఖిల్ ఎత్తుతాడా?, లేకపోతే గౌతమ్ ఎత్తుతాడా అనే విషయంపై ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొంది.

    ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. క్రిస్మస్ కి హీరో నితిన్ నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా, నితిన్, శ్రీలీల ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. హౌస్ లోపలకు వీళ్లిద్దరు వెళ్లి, వీళ్ళతో పాటు ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బయటకి తీసుకొని రాబోతున్నారు. వీళ్ళ తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా మరో అతిథిగా రాబోతున్నది. సంక్రాంతికి ఈయన హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం వెంకటేష్ రాబోతున్నారు. అదే విధంగా బాలయ్య బాబు హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా సంక్రాంతికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం డైరెక్టర్ బాబీ, ఊర్వశి రౌతేలా రాబోతున్నారు. ఇక చివరిగా ట్రోఫీ ని అందించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అదే విధంగా టాప్ 3 కంటెస్టెంట్స్ కి ప్రైజ్ మనీ ఆఫర్స్ కూడా రానున్నాయి, ఈసారి టైటిల్ విన్నర్ కి మాత్రమే కాకుండా, రన్నర్ కి కూడా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.