https://oktelugu.com/

AP Rains: ఏపీలో ఆ జిల్లాలకు భారీ హెచ్చరిక! వారం పాటు అలెర్ట్.. ఏం జరుగనుంది.?

ఏపీని వర్షాలు వీడడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఏపీ పై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 09:48 AM IST

    Heavy Rains in AP

    Follow us on

    AP Rains:  ఏపీకి వర్ష సూచన. వరుస అల్పపీడనాలతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. దాదాపు పక్షం రోజులుగా రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో వానలు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరో హెచ్చరిక వచ్చింది. ఈనెల 15 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. జిల్లాల యంత్రాంగాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రైతులకు పలు సూచనలు చేసింది. నేటి నుంచి వారం రోజులపాటు చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని.. వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

    * రాయలసీమకు హెచ్చరిక
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల 11న రాయలసీమలో విస్తారంగా, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తా, రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి ఉన్నాయి. అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అల్పపీడనం మరింత బలపడితే వర్షాలు ఉధృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల్లో కూడా ఆందోళనకు అదే కారణం. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం సేకరణ కూడా ఉత్సాహంగా సాగుతోంది.

    * రాగల 24 గంటల్లో
    రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మో స్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ నెల 15 వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశించింది. మరోవైపు ఈనెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చు అని ఐరోపాకు చెందిన వాతావరణ శాఖ చెబుతోంది. దాని ప్రభావం కూడా ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ ఒక అంచనా వేస్తోంది.