Akhanda 2 Pre Release Event: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న బాలయ్య కెరీర్ ని గాడిలో పెట్టిన అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కాబట్టి. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. నాలుగు సినిమాలు చేస్తే నాలుగు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఐదవ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయం లో కూడా బాలయ్య ఎక్కడా తగ్గడం లేదు. నాన్ స్టాప్ గా ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 28న హైదరాబాద్ లో చేయబోతున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ఊహించని కాంబినేషన్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు అట. వాళ్ళు ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇంకొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో కూడా అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అల్లు అర్జున్ ని ఒక అతిధి గా పిలిచాడు. ఇక ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా వచ్చేందుకు అంగీకారం తెలపడం గమనార్హం.
అల్లు అర్జున్ మరియు రేవంత్ రెడ్డి కి మధ్య గత ఏడాది ఎలాంటి వాగ్వాదం నడిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని తప్పుబడుతూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసాడు. ఇది శాశ్వతంగా అసెంబ్లీ రికార్డ్స్ లో ఉండిపోతుంది. అంతటి అవమానం చేసినప్పటికీ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి పాల్గొని అవార్డు ని అందుకున్నాడు, ఇప్పుడు కూడా ఆయన సీఎం తో కలిసి వేదిక ని పంచుకోబోతున్నాడు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఈ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించి ఉండొచ్చు కదా?, ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.