Bigg Boss 9 Telugu Emmanuel: ఫ్యామిలీ వీక్ అవ్వడం తో ఈ వారం ప్రతీ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఎపిసోడ్ కి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి తనూజ, దివ్య, డిమోన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యాయి. వీరిలో దివ్య మరియు తనూజ కుటుంబాలు ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఇక నేడు భరణి, రీతూ చౌదరి మరియు పవన్ కళ్యాణ్ కుటుంబాలు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాయి. రేపు ఇమ్మానుయేల్ తల్లి హౌస్ లోకి రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, భరణి, దివ్య, డిమోన్ పవన్ మరియు సంజన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిలో పవన్ కళ్యాణ్ కి అత్యధిక ఓటింగ్ నమోదు అవుతుందని అందరూ అనుకోవడం సహజమే. కానీ బయట పరిస్థితి అలా లేదట.
ఇమ్మానుయేల్ కి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ నమోదు అవుతుందట. మిస్సెడ్ కాల్స్ అత్యధికంగా ఇమ్మానుయేల్ కి మాత్రమే వస్తున్నాయట. ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళు మూసుకొని అతనికి ఓట్లు వేసేస్తున్నారు. ఈ సీజన్ అసలు ఇమ్మానుయేల్ ని లేకుండా అసలు ఊహించుకోలేము. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించడం మాత్రమే కాకుండా, కంటెస్టెంట్స్ అందరితో ఎంతో మంచిగా మెలగడం, టాస్కులు అద్భుతంగా ఆడడం, తెలివిగా స్ట్రాటజీలు వేయడం, ఇలా ప్రతీ విషయం లోనూ ఇమ్మానుయేల్ తోపు అని అనిపించుకున్నాడుజ్. అందుకే ఆడియన్స్ అతనికి బ్రహ్మరథం పడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ వారం ఎవరు టాప్ 1 , ఎవరు టాప్ 2 అనేది చెప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ లకు సరిసమానమైన ఓటింగ్ పడుతోంది. ఇప్పుడు మూడవ స్థానం కూడా ఈ వారం చాలా టఫ్ అని అంటున్నారు. ఎందుకంటే భరణి, డిమోన్ కళ్యాణ్ లకు కూడా సరిసమానమైన ఓటింగ్ పడుతోంది అట.
నిన్న డిమోన్ పవన్ తల్లి హౌస్ లోకి వచ్చింది కాబట్టి, అతనికి కాస్త ఓటింగ్ పెరిగిందట. ప్రస్తుతానికి మూడవ స్థానం లో డిమోన్ పవన్, నాల్గవ స్థానం లో భరణి కొనసాగుతున్నారు. నేడు భరణి కుటుంబం హౌస్ లోకి వస్తుంది కాబట్టి, ఆయన మూడవ స్థానం లోకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరి రెండు స్థానాల్లో సంజన, దివ్య కొనసాగుతున్నారు. దివ్య చివరి స్థానంలో ఉంది. కానీ నిన్న ఆమె తల్లి హౌస్ లోకి రావడం దివ్య కి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఆమెకు కూడా సంజన తో కాస్త సమానంగా ఓటింగ్ పడుతోంది అట, కానీ ప్రస్తుతానికి దివ్య నే చివరి స్థానం లో ఉందని సమాచారం. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ వారం ఫ్యామిలీ వీక్ అవ్వడం తో ఎలిమినేషన్ ఉండదని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.