Rajamouli: ఒకప్పుడు రాజమౌళి(SS Rajamouli) సినిమాల్లో ఆయుధాలు బాగా హైలైట్ అయ్యేవి. సింహాద్రి, విక్రమార్కుడు , ఛత్రపతి, మగధీర ఇలా ప్రతీ సినిమాలోనూ వెరైటీ డిజైన్స్ తో ఆయుధాలు చేయించి ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన జంతువులనే ఎక్కువగా ఆయుధాలుగా వాడుతున్నాడు. ఆయన గత చిత్రం #RRR లో అడవి జంతువులను ఏ రేంజ్ లో ఉపయోగించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయం లో ఎన్టీఆర్ జంతువులతో ఒక్కసారిగా దూకే షాట్ ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అదే ఇంటర్వెల్ ఫైట్ లో పులి పై రామ్ చరణ్ దాడి చేయడం కూడా హైలైట్ గా నిల్చింది. అప్పట్లో దీనిపై సోషల్ మీడియా లో ఎన్నో ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం లో కూడా జంతువుల వాడకం చాలా బలంగా ఉండబోతుంది అని గ్లింప్స్ ని చూస్తేనే అర్థం అవుతోంది.
గ్లింప్స్ చివర్లో మహేష్ బాబు ఎద్దు మీద స్వారీ చేస్తున్న వస్తున్న షాట్ పై సోషల్ మీడియా లో ఎన్నో ఫన్నీ మీమ్స్ వచ్చాయి. అందులో సింహం, పులి కి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రాజమౌళి రీసెంట్ గా జరిగిన #Globetrotter కి మమ్మల్ని పిలవలేదని పాపం ఈ ఎండు జంతువులూ ఫీల్ అవుతూ ఉంటాయి. ముందుగా పులి సింహం తో మాట్లాడుతూ ‘మన జక్కన నీ విషయం లో ఇంత మోసం చేస్తాడని ఊహించలేదు మావా’ అని అంటాడు. దానికి సింహం సమాధానం చెప్తూ ‘లైట్ లేరా దూతగా, ఈ టాపిక్ వదిలేయ్ . పదే పదే గుర్తు చేసి బాధపెట్టకు’ అని అంటాడు. అప్పుడు పులి ‘లేదు మావా..నేను ఈ విషయాన్నీ అంత తేలికగా తీసుకోలేకపోతున్న. ఆఫ్రికా అని చెప్పి అందులో నిన్ను చూపించకపోవడం ఏంటి’ అని అంటుంది.
దానికి సింహం సమాధానం చెప్తూ ‘ఒరేయ్ నాయనా. నీకు దండం పెడుతా వదిలేయ్..ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది ‘ అని చెప్పొఉకొచ్చాడు. ‘అది కాదు మావా..ఆఫ్రికా పార్ట్ గ్లింప్స్ లో చూపిస్తాడు కదా, అందులో జిరాఫీ గాడు ఉన్నాడు, కంచెర గాడిదలు కూడా ఉన్నాయి, నువ్వే లేవు, అందులో నిన్ను యాడ్ చేసి ఉండొచ్చు, అదే నా బాధ’ అని అంటుంది పులి. ఇలా ఆద్యంతం సరదాగా ఫన్నీ గా సాగిపోయే ఈ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియో నే కనిపిస్తోంది.
Don’t miss the ending… Thopu edit pic.twitter.com/zgfpvvCy6O
— Nani (@Ravanaroy) November 19, 2025