Ramabanam 2nd Day Collection : ‘రామబాణం’ రెండవ రోజు వసూళ్లు..టాలీవుడ్ కి మరో డిజాస్టర్

రీసెంట్ గా రామబాణం కూడా అదే తరహా ఫ్లాప్ అవ్వడం తో కేవలం ఈ రెండు సినిమాల నుండే 50 కోట్ల రూపాయిల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : May 7, 2023 8:21 am
Follow us on

Ramabanam 2nd Day Collection : ‘పక్కా కమర్షియల్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత గోపీచంద్ చేసిన చిత్రం ‘రామ బాణం’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర దర్శకుడు శ్రీవాస్ తో గతం లో గోపీచంద్ ‘లక్ష్యం’ మరియు ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు.మళ్ళీ అతని మీద నమ్మకం పెట్టి ‘రామబాణం’ చేసాడు.టీజర్ మరియు ట్రైలర్ చూసినప్పుడే ఇంత రొటీన్ గా ఉందేంటి అని ప్రేక్షకులకు అనిపించింది.

విడుదల తర్వాత కూడా అదే రేంజ్ టాక్ వచ్చింది.రొటీన్ గా ఉన్నప్పటికీ కనీసం పాటలు బాగున్నా, టేకింగ్ కొత్తగా అనిపించిన సూపర్ హిట్ అయ్యేది. కానీ స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా రాసుకున్నాడు డైరెక్టర్.ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం కోటి 25 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన సంగతి తెలిసిందే.సినిమాకి జరిగిన బిజినెస్ కి వచ్చిన ఓపెనింగ్ కి అసలు సంబంధమే లేదు.

హిట్ కాంబినేషన్ అవ్వడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి కేవలం 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిల షేర్ మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉంది, అంటే దాదాపుగా 12 కోట్ల రూపాయిల నష్టం బయ్యర్స్ కి రాబోతుంది అన్నమాట.

ఈ సమ్మర్ లో విరూపాక్ష చిత్రం పెద్ద హిట్ అయ్యి టాలీవుడ్ మార్కెట్ ని కళకళలాడేలా చేస్తే, ఆ తర్వాత వచ్చిన ‘ఏజెంట్’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచి ట్రేడ్ పండితులను నిరాశపర్చింది.ఇప్పుడు రీసెంట్ గా రామబాణం కూడా అదే తరహా ఫ్లాప్ అవ్వడం తో కేవలం ఈ రెండు సినిమాల నుండే 50 కోట్ల రూపాయిల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.