https://oktelugu.com/

Ugram Closing Collections: ‘ఉగ్రం’ క్లోసింగ్ కలెక్షన్స్.. అల్లరి నరేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్!

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్ లో 2.80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ కి ఆమడ దూరం లో ఈ చిత్రం ఆగిపోయింది అన్నమాట ఈ చిత్రం.

Written By:
  • Vicky
  • , Updated On : May 17, 2023 / 05:51 PM IST
    Follow us on

    Ugram Closing Collections: అల్లరి నరేష్ ఈమధ్య తన స్టైల్ ని మార్చి వరుసగా సీరియస్ సబ్జక్ట్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఆ ప్రయత్నం లో ‘నాంది’ అనే చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది, ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. వాటి లిస్ట్ లో ఇప్పుడు రీసెంట్ గా ‘ఉగ్రం’ కూడా చేరింది. ఒక మంచి స్టోరీ లైన్ సరైన టేకింగ్ లేకపోవడం వల్ల ఫ్లాప్ అయిన చిత్రం ఇది.

    కనీసం ఎడిటింగ్ పరంగా అయినా కేర్ తీసుకొని ఉండుంటే ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ డైరెక్టర్ పొరపాటు వల్ల ఫుల్ రన్ లో చివరికి డిజాస్టర్ గా మిగిలింది.ఇదే స్టోరీ ని వేరే డైరెక్టర్ తీసి ఉంటే సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం. నాల్గవ రోజు నుండే డైలీ షేర్ వసూళ్లు పూర్తిగా తగ్గిపోయిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత రాబట్టిందో ఒకసారి చూద్దాము.

    ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రింట్ ఖర్చులు మరియు పబ్లిసిటీ ఖర్చలను కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి రోజు ఈ కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయిన ఈ సినిమా, మొదటి వీకెండ్ వరకు మొదటి రోజు వచ్చిన వసూళ్ల రేంజ్ లోనే డ్రాప్స్ పడకుండా ఆడింది.కానీ నాల్గవ రోజు నుండి వసూళ్లు పూర్తి గా డౌన్ అయ్యాయి.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫుల్ రన్ లో 2.80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ కి ఆమడ దూరం లో ఈ చిత్రం ఆగిపోయింది అన్నమాట ఈ చిత్రం. తక్కువ బ్రేక్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఫైనల్ గా డిజాస్టర్ గానే మిగిలింది. ఇది పూర్తిగా డైరెక్టర్ పొరపాటే అని అంటున్నారు విశ్లేషకులు.