Ramabanam Closing Collections: 22 కోట్లు పెట్టి కొన్నారు.. ఫుల్ రన్ లో కనీసం ‘పబ్లిసిటీ’ ఖర్చులను కూడా రాబట్టలేకపోయిన ‘రామబాణం’

టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేవి, కానీ ఇప్పుడు డీసెంట్ సినిమాలను ఇస్తున్నా కూడా ఆదరించడం లేదు, అందుకు కారణం ఆయన నేటి తరం యూత్ కి తగ్గట్టుగా మారకపోవడమే.

Written By: Vicky, Updated On : May 17, 2023 5:48 pm

Ramabanam Closing Collections

Follow us on

Ramabanam Closing Collections: ఈమధ్య హీరో గోపీచంద్ పాపం ఎలాంటి సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి.బాగున్న సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడడం లేదు, ఇక బాగాలేని సినిమాలు అయితే కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయి, క్లోసింగ్ కలెక్షన్స్ అయితే మరీ దారుణంగా ఉంటున్నాయి. ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి ఒక పండుగ లాంటిది.

టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేవి, కానీ ఇప్పుడు డీసెంట్ సినిమాలను ఇస్తున్నా కూడా ఆదరించడం లేదు, అందుకు కారణం ఆయన నేటి తరం యూత్ కి తగ్గట్టుగా మారకపోవడమే. రీసెంట్ గా విడుదలైన రామబాణం చిత్రం అందుకు ఉదాహరణ. తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ అవ్వడం తో గోపీచంద్ కళ్ళు మూసుకొని స్క్రిప్ట్ కూడా వినకుండా ఈ చిత్రాన్ని చెయ్యడానికి ఒప్పుకున్నట్టు ఉన్నాడు. అందుకే అంత నాసిరకపు సినిమా చెయ్యాల్సి వచ్చింది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి 5 వ రోజు నుండే షేర్స్ రావడం ఆగిపోయాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది?, జరిగిన బిజినెస్ ఎంత ?, నిర్మాతలు మరియు బయ్యర్స్ ఈ చిత్రం ద్వారా ఎంత నష్టపోయారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా జరిగిందట. మొదటి రోజు ఈ చిత్రానికి కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని ఆశించారు మేకర్స్. కానీ డిజాస్టర్ టాక్ రావడం తో ఈ చిత్రానికి ఆశించిన వసూళ్ళలో 50 శాతం మాత్రమే మొదటి రోజు వచ్చింది.

ఇక రెండవ రోజు నుండి చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి జీరో షేర్స్ నమోదు కూడా అయ్యాయి.కానీ ఓవరాల్ గా 5 రోజుల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి ఆ తర్వాత ఆగిపోయింది. అలా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, అంటే దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం అట. అసలే గడ్డు కాలం ఎదురుకుంటున్న గోపీచంద్ మార్కెట్ ని ఈ చిత్రం మరింత క్రిందకి లాగేసింది.