https://oktelugu.com/

Varun Tej- Lavanya Tripathi Engagement: వరుణ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం… నిహారిక షాకింగ్ రియాక్షన్, క్లారిటీ ఇచ్చినట్లే!

లావణ్య,వరుణ్ తేజ్ జంటగా మిస్టర్ మూవీలో నటించారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. మిస్టర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వీరి పెళ్లిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Written By:
  • Shiva
  • , Updated On : May 17, 2023 / 05:54 PM IST

    Varun Tej- Lavanya Tripathi Engagement

    Follow us on

    Varun Tej- Lavanya Tripathi Engagement: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో రిలేషన్ లో ఉన్నారని చాలా కాలంగా వినిపిస్తుంది. లావణ్యను వరుణ్ వివాహం చేసుకుంటారని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకారు మరో లెవల్ కి చేరింది. జూన్ నెలలో వరుణ్-లావణ్యల నిశ్చితార్థం అట. ఇరు కుటుంబ సభ్యులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని కథనాల సారాంశం. ఈ క్రమంలో వరుణ్ సిస్టర్ నిహారికను స్పష్టత కోరే ప్రయత్నం చేసింది మీడియా. నిహారిక నటించిన డెడ్ ఫిక్సెల్స్ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమ్ కానుంది. ప్రమోషనల్స్ లో పాల్గొన్న నిహారికకు ఈ ప్రశ్న ఎదురైంది.

    వరుణ్-లావణ్యలు నిశ్చితార్థం చేసుకుంటున్నారట కదా… అని అడగ్గా, నిహారిక అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. డెడ్ ఫిక్సెల్స్ కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండి అన్నారు. నిహారిక ఈ మేటర్ ని ఖండించని నేపథ్యంలో నిజమే కావచ్చని పలువురు భావిస్తున్నారు. గతంలో లావణ్య ఈ కథనాలను ఖండించారు. వరుణ్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదన్నారు.

    లావణ్య,వరుణ్ తేజ్ జంటగా మిస్టర్ మూవీలో నటించారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. మిస్టర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వీరి పెళ్లిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. జూన్ నెల ఎంతో దూరం లేదు కాబట్టి… తినబోతూ రుచి అడగడం అనవసరం. ఇక లావణ్య కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డారు. ఈ మధ్య కాలంలో లావణ్య నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి.

    పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇక వరుణ్ ఎఫ్ 3 మూవీతో మంచి విజయం సాధించారు. గని మాత్రం నిరాశపరిచింది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేశారు. ఈ పాత్రను సహజంగా పండించేందుకు వరుణ్ కఠిన శిక్షణ తీసుకున్నారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సాధించారు. ఆయన కష్టానికి ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున చిత్రం చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటుంది.