https://oktelugu.com/

Udaipur: హఠాత్తుగా చిరుత పాలమ్మే వ్యక్తికి దూసుకొచ్చింది.. ఆ తర్వాత జరిగింది చూస్తే ఒళ్లు గగుర్పొడచడం ఖాయం.. వైరల్ వీడియో

రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ ప్రాంతంలో ఓ చిరుత పులి పాలమ్మే వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. ఆ పాలమ్మే వ్యక్తి రాత్రి 8:30 ప్రాంతంలో తన బైక్ మీద పాల క్యాన్ లతో వెళ్తున్నాడు.

Written By: , Updated On : February 13, 2025 / 02:00 AM IST
Udaipur

Udaipur

Follow us on

Udaipur: అభివృద్ధి పేరుతో మనుషులు ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్నారు. ఫలితంగా జనావాస ప్రాంతాలే కాదు.. అడవుల్లో కూడా చెట్టు తగ్గుతున్నాయి. ఫలితంగా వేడి అంతకంతకు పెరుగుతోంది. నీటి లభ్యత.. ఆహార భద్రత పడిపోతుంది.. ఈ క్రమంలో ఒక జాతికి చెందిన జంతువుల సంఖ్య పెరుగుతుంటే.. చాలావరకు జంతువులు తగ్గిపోతున్నాయి. ఇక కొన్ని జంతువులయితే తమ మనుగడ కోసం జనావాసాల మీద పడుతున్నాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా.

రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్ ప్రాంతంలో ఓ చిరుత పులి పాలమ్మే వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. ఆ పాలమ్మే వ్యక్తి రాత్రి 8:30 ప్రాంతంలో తన బైక్ మీద పాల క్యాన్ లతో వెళ్తున్నాడు. అయితే అటువైపుగా ఉన్న ఓ చిరుత పులి గోడ దూకి.. రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇదే క్రమంలో పాలు అమ్మే వ్యక్తి కనిపించడంతో అతనిపై దాడికి యత్నించింది. పులి ఒక్కసారిగా మీద పడటంతో పాలమ్మే వ్యక్తి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతని బైక్ కింద పడింది. పాలు కూడా రోడ్డుపాలయ్యాయి. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిరుత పులికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం చిరుతపులి అలానే కింద పడిపోయింది. దానికి గాయాలు కావడంతో లేవడానికి ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సిసిటివి కెమెరాలు రికార్డయ్యాయి..ఆ దృశ్యాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చిరుత పులి లేచింది

ఈ ఘటన తర్వాత చిరుత పులి నెమ్మదిగా లేచింది. కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత చీకట్లోకి వెళ్లిపోయింది. ఇక అదే రోడ్డు మీద ఓ కారులో వస్తున్న వ్యక్తులు.. ఆ పాలు అమ్మే వ్యక్తిని చూసి.. తమ వాహనాన్ని ఆపారు. అతడిని పైకి లేపి.. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయపూర్ ప్రాంతంలో ఈ ఘటన మొదటిది కాదు. 2023లో ఉదయపూర్ ప్రాంతంలో చిరుత పులి 80 ప్రాంతాలలో దాడులు చేసింది.. గత ఏడాది చిరుత పులి దాడిలో 8 మంది చనిపోయారు. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో 2017లో 507 చిరుతలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 925 కు చేరుకుంది. చిరుతపులులు మనిషి మాంసానికి అలవాటు పడటం.. జనావాసాలకు వచ్చి ఆవులు, ఇతర జంతువులపై దాడులకు పాల్పడుతున్నాయి. తద్వారా వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. సమీపంలో ఉన్న అడవిలో తలదాచుకుంటూ.. ఆకలి వేసినప్పుడు జనావాసాల్లోకి వస్తున్నాయి. మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఆవులు, ఇతర జంతువులను చంపితింటున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఆవుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్ర విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలపై చిరుతపులి లాంటి జంతువులు పడి.. దాడులు చేస్తుంటాయి. మనుషులను చంపితింటాయి. జంతువులపై కూడా దాడులు చేసి తమ ఆకలి తీర్చుకుంటాయి. అందువల్లే చిరుత పులుల సంతతి గతంతో పోల్చుకుంటే పెరిగిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు..” ఉదయపూర్ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. చిరుతపులుల దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా జనావాసాల్లోకి వచ్చి చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. అందువల్లే ఇటువంటి ఘటనలు నమోదు అవుతున్నాయని” అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.