Jagan
Jagan: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. ఓవైపు పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇంకోవైపు తటస్థ నాయకులను పార్టీలోకి తెచ్చి వారి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఎంతమంది నేతలు బయటకు వెళ్లిపోయినా పర్వాలేదని సంకేతాలు ఇస్తున్నారు. పార్టీని పునర్నిర్మించుకుంటానని చెబుతున్నారు. అదే సమయంలో తన వైఫల్యాలను సైతం ఒప్పుకుంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతున్నారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. 2.0 మాత్రం కార్యకర్తల కోసమేనని తేల్చి చెబుతున్నారు. ప్రజలకు అన్నీ చేసిన మనమే ఓడిపోయామని.. ఒక్క సంక్షేమ పథకం అమలు చేయని చంద్రబాబును ప్రజలు ఓడిస్తారని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరో 25 ఏళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు.
* ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లే తన సర్వస్వమని చెప్పుకునేవారు. ఐపాక్ తో పాటు సోషల్ మీడియాను నమ్ముకునేవారు. కానీ పార్టీ శ్రేణులను పట్టించుకోలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చినా.. ఆ 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం భయపెడుతోంది. ఓటమి నుంచి కోలుకున్న జగన్మోహన్ రెడ్డి.. పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఎంత ముఖ్యమో జగన్ కు అర్థమయింది. అందుకే వారి అభిమానాన్ని చూరగొనాలని తపన పడుతున్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమైన విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు. 2019 నుంచి 24 మధ్య కార్యకర్తలను న్యాయం చేయలేకపోయానని స్వయంగా ప్రకటించారు జగన్.
* ఉగాది నుంచి జిల్లాల పర్యటన
ఉగాది నుంచి జిల్లాల పర్యటన ( district Tours) చేయాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందే ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరు జిల్లాలకు సంబంధించి సమావేశాలు పూర్తయ్యాయి. మరో ఏడు జిల్లాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. తన తప్పిదాలను ఒప్పుకున్నారు జగన్. ఓ రెండేళ్ల పాటు కొవిడ్ ఉండడంతో కార్యకర్తలను పట్టించుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు చేయాల్సినంతగా చేయలేకపోయానని గుర్తు చేసుకున్నారు జగన్. మరోసారి ఆ పరిస్థితి ఉండదని చెప్పుకున్నారు.
* మారిన జగన్ స్ట్రాటజీ
అయితే పార్టీ శ్రేణుల విషయంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ( strategy ) మార్చారు. గతం మాదిరిగా పరిస్థితి ఉండబోదని తేల్చి చెప్పారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తల మనోభావాలను గుర్తించి నడుచుకుంటానని తేల్చి చెప్పారు. మరోసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని భరోసా కల్పించేలా కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన తప్పులు ఒప్పుకుంటూ.. మరోసారి ఆ తప్పు జరగనివ్వనంటూ.. పార్టీ శ్రేణులు వైసీపీలో కొనసాగేలా తపన పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అధినేతలు ఈ తరహా మార్పును ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.