TDP
TDP: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పులివెందులపై ( pulivendula )ఫోకస్ పెట్టిందా? ఆ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకోవాలని భావిస్తుందా? జగన్మోహన్ రెడ్డికి ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఐదు దశాబ్దాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చేతిలో ఉంది పులివెందుల. అటువంటి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి బలం తగ్గింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ పడిపోయింది. అందుకే ఈసారి అక్కడ పట్టు బిగించాలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
* మున్సిపాలిటీల్లో మారిన సీన్
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీలపై( municipalities) తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మున్సిపాలిటీల్లో సీన్ మారింది. ఎన్నికలకు ముందు కొందరు.. ఎన్నికల తర్వాత మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి గూటికి వచ్చారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నాలుగేళ్ల పదవీకాలం పూర్తయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలపై కూటమి కన్నేసింది. అందులో భాగంగా ఇటీవల 12 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇప్పుడు టిడిపి దృష్టి పులివెందుల మున్సిపాలిటీ పై పడింది.
* వైసీపీకి స్పష్టమైన బలం
మున్సిపల్ ఎన్నికల్లో పులివెందులలో వైసిపి( YSR Congress ) ఏకపక్షంగా విజయం సాధించింది. సమీపంలో కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. అయితే అధికార మార్పిడితో ఇప్పుడు పులివెందులను ఎలాగైనా కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి వైసీపీకి కంచుకోట అయినా.. బలమైన ప్రయత్నమే చేస్తోంది టిడిపి. ఇక్కడ టిడిపి జెండా ఎగురవేయాలని నేతలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మొత్తం వార్డుల వారీగా నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వైసిపి కౌన్సిలర్ షాహిదా టిడిపిలో చేరిపోయారు. ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. వస్తూ వస్తూ 30 మందికి పైగా ముస్లిం మైనారిటీ నాయకులను ఆయన టిడిపిలో చేర్చారు. మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* మరింత దూకుడుగా బీటెక్ రవి
పులివెందుల టిడిపి ఇన్చార్జిగా బీటెక్ రవి( BTech Ravi ) ఉన్నారు. ప్రస్తుతం ఆయన దూకుడుగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి గట్టి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ధైర్యం కనబరిచారు. తన ప్రత్యర్థి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలిసి కూడా పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అరెస్టులకు భయపడలేదు. కేసులతో వెనక్కి తగ్గలేదు. అయితే ఈసారి కూటమి అధికారంలో ఉండడంతో తనకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని భావిస్తున్నారు. అందుకే పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.