Balakrishna And Rajamouli: నందమూరి నటసింహంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు… ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరికి పోటీని ఇస్తూ ప్రస్తుతం తను నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం… వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…బాలయ్య బాబు ఒకప్పుడు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వచ్చాడు. భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి గొప్ప చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియా గర్వించదగ్గ దర్శకులలో ఒకడిగా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి బాలయ్య బాబుతో కెరియర్ స్టార్టింగ్ లో రెండు సినిమాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ – ఆర్జీవీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్ అవ్వడానికి కారణం ఎవరు..?
కానీ అందులో ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. అందులో మొదటిది సింహాద్రి సినిమా కాగా, రెండోది విక్రమార్కుడు… ఈ రెండు సినిమాలు బాలయ్య బాబుతో చేయాలని అనుకున్నారట. కానీ కొన్ని సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ రెండు సినిమాలు చేయలేకపోయానని బాలయ్య గతంలో ఒకసారి క్లారిటీ కూడా ఇచ్చాడు.
బాలయ్య రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసి ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని మరికొంతమంది కామెంట్లు చేస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపిస్తే ఆ కిక్ వేరే లెవల్లో ఉంటుంది.అలా పవర్ ఫుల్ గా చూపించాలంటే కూడా డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసుకుంటూ పోయే బాలయ్యను బాగా వాడుకునే డైరెక్టర్ కావాలి. ఇక బి.గోపాల్ లాంటి దర్శకుడు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బాలయ్య బాబుని చూపించిన విధానం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిందనే చెప్పాలి…
రాజమౌళి తో ఒక సినిమా చేసి ఉంటే ఆయన కూడా బాలయ్యను ఒక సింహం లా చూపించేవాడు. ఇక రాజమౌళి చేసిన ఆ రెండు సినిమాల్లో ఏదో ఒకటి చేసి ఉంటే బాగుండేది అని బాలయ్య చాలాసార్లు తన సన్నిహితుల దగ్గర చెబుతుంటారట…ఇక ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది…