Jr NTR And RGV: ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని సైతం పెంచుకుంటూ వచ్చాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు నడపడంలో ఆయన కీలకపాత్ర వహించాడు… ఆయన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం వరుస సక్సెస్ లను సాధించి కెరియర్ స్టార్టింగ్ లోనే టాప్ హీరోగా ఎదిగాడు… ‘సింహాద్రి’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
Also Read: శివ సినిమా ఫైట్ కోసం ఏకంగా ఫైట్ మాస్టర్ ని తీసేసిన వర్మ… ఇంట్రెస్టింగ్ స్టోరీ…
ఎన్టీఆర్ సైతం ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి అంటే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా సమయంలో వర్మకి బాలీవుడ్ లో అమితాబచ్చన్ నుంచి ఆఫర్ రావడంతో అక్కడి సినిమా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ సినిమాని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తానని చెప్పాడు.
మొత్తానికైతే ఎన్టీఆర్ కూడా దానికి ఒప్పుకున్నప్పటికి ఆ తర్వాత వర్మ ఆ ప్రాజెక్టు గురించి అసలు పట్టించుకోలేదట. అందువల్లే ఆర్జీవీ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా రాలేదని ఇప్పటికి చాలామంది సినిమా మేధావులు సైతం చెబుతూ ఉంటారు. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే మాత్రం అది సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించేదని పలువురు విమర్శకులు సైతం వీళ్ళ కాంబినేషన్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దేవర సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఎప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…