Ravi Teja: సినిమా ఇండస్ట్రీ లో రాణించడం అంటే అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు… ఇక్కడ ఎన్నో అవమానాలను తట్టుకొని నిలబడిన వాళ్లకు మాత్రమే సక్సెసులైతే వస్తాయి…ఇండస్ట్రీ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సైడ్ క్యారెక్టర్స్ లో నటించి హీరోగా మారిన నటుడు రవితేజ…వరుసగా మాస్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. మాస్ మహారాజా గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. ఇక రీసెంట్ గా ఆయన చేస్తున్న సినిమాలన్నీ మాస్ సినిమాలే కావడంతో వరుసగా వచ్చిన సినిమాలు వచ్చినట్టు షెడ్డు కి వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ ఇంతకు ముందు ఆయనే చాలాసార్లు చేశాడు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ – ఆర్జీవీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్ అవ్వడానికి కారణం ఎవరు..?
మరి ఇలాంటి క్రమంలోనే తన పంథా ను మార్చి ఫ్యామిలీ మూవీస్ అలాగే ప్రేమ కథ చిత్రాలను బాగా తీయగలిగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో రవితేజ చాలా సాఫ్ట్ లుక్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్ జాతర సినిమాలో సైతం రవితేజ మాస్ అవతారం ఎత్తాడు.
కాబట్టి ఈ సినిమాలో కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో అయిన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికైనా రవితేజ తన రూటు మార్చి మంచి సినిమాల వైపు అడుగులు వేస్తుండటం చాలా మంచి పరిణామం అంటూ రవితేజను పోగొడుతున్నారు. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల సైతం సక్సెస్ లో లేడు తనకు కూడా అర్జెంటుగా ఒక హిట్ రావాల్సి ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే ఈ సినిమాతో ఆయన గొప్ప విజయాన్ని సాధించి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలను చేసే స్థాయికి ఎదగాలనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరికి ఇప్పుడు సక్సెసులైతే అవసరం కాబట్టి ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…