https://oktelugu.com/

Indra Movie: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!

ఫస్ట్ హాఫ్ మొత్తానికి చిరంజీవే దర్శకత్వం వహించాడని అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్ . క్లైమాక్స్ సన్నివేశం కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే జరిగిందట. ఇదంతా విన్న తర్వాత మెగాస్టార్ లో దర్శకత్వ ప్రతిభ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ..?, అదే మరి మెగాస్టార్ అంటే!..రేపటితో ఆయన 69 వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 21, 2024 / 03:34 PM IST

    Indra Movie

    Follow us on

    Indra Movie: రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఇంద్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సీనియర్ హీరోల క్యాటగిరీలో ఇదొక ఆల్ టైం రికార్డు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. అలాగే లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇంద్ర కి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

    ఈ సందర్భంగా ఇప్పటి వరకు ‘ఇంద్ర’ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఈ చిత్రానికి ఆయన మాత్రమే కాదు, ఒక స్టార్ హీరో కూడా దర్శకత్వం వహించాడట. ఆయన మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవే. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇంద్ర సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే బి గోపాల్ కి సమాంతరంగా జూనియర్ ఎన్టీఆర్ తో ‘అల్లరి రాముడు’ అనే చిత్రం చెయ్యాల్సి వచ్చింది. ఈ రెండు చిత్రాలు కూడా కేవలం వారం గ్యాప్ లో విడుదల అయ్యాయి. రెండు సినిమాల ఫలితాలు ఏంటో మనకి తెలుసు. అయితే ఒకానొక సమయం లో రెండు సినిమాలు సమాంతరం గా చెయ్యడం బి గోపాల్ కి చాలా కష్టమయ్యేదట. అలాంటి సమయంలో చిరంజీవి 50 శాతం కి పైగా సినిమాకి దర్శకత్వం వహించాడట. అంతే కాదు దర్శకుడి స్థానం లో కూర్చొని, సినిమాలోని ఒక సన్నివేశానికి సంబంధించిన సందర్భాన్ని వివరిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తో ‘భం భం భోలే’ పాటని కంపోజ్ చేయించాడట.

    ఫస్ట్ హాఫ్ మొత్తానికి చిరంజీవే దర్శకత్వం వహించాడని అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్ . క్లైమాక్స్ సన్నివేశం కూడా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే జరిగిందట. ఇదంతా విన్న తర్వాత మెగాస్టార్ లో దర్శకత్వ ప్రతిభ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు కదూ..?, అదే మరి మెగాస్టార్ అంటే!..రేపటితో ఆయన 69 వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నాడు. గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సినిమాకి పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించాలనే కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అంటే వచ్చే ఏడాది లో చిరంజీవి నిజంగా మెగా ఫోన్ పెట్టబోతున్నాడా?, ఒక వేల దర్శకత్వం వహిస్తే అందులో ఆయన నటిస్తాడా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న.