Homeఎంటర్టైన్మెంట్Shrutiraj : శ్రీకాంత్ పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

Shrutiraj : శ్రీకాంత్ పక్కన నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

Shrutiraj : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు మాత్రమే స్టార్ హీరోలు ఉండేవారు. వారి సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసేవారు. ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ… ఇలా ఎలాంటి వేరియంట్ లోనైనా వీరు నటించేవారు. అందుకే దశాబ్ద కాలంగా వీరు సిని ఇండస్ట్రీలో కొనసాగగలిగారు. అలాంటి వారిలో శ్రీకాంత్ ఒకరు. తొలుత విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ఆ తరువాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పుడు శ్రీకాంత్ ఎలాంటి సినిమాతోనైనా ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. 20వ దశకంలో వరుసగా వచ్చిన ఫ్యామిలీ స్టోరీల్లో శ్రీకాంత్ హీరోగా తనదైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 2002లో శ్రీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ చినదాన’. ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు రాజా హీరోగా నటించారు. అయితే శ్రీకాంత్ కు జోడిగా వచ్చిన హీరోయిన్ గుర్తుందా? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే?

తమిళం, కన్నడం, మలయాళం హీరోయిన్లు చాలా మంది తెలుగు సినిమాల్లో సక్సెస్ అయ్యారు. వీరి బాటలోనే శృతిరాజ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో సంవత్సరంలో ‘మాన్బుమిగు మానవన్’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన శృతి రాజ్ ఆ తరువాత ఎలవం కోడు దేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత 2001లో వేణు హీరోగా వచ్చిన ‘వీడెక్కడి మొగుడండీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

2002లో ఈ సత్తిబాబు ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. ‘Things I Hate About U’ అనే సినిమా ఆధారంగా ‘చిన్నదాన’ సినిమాను థియేటర్లోకి తీసుకొచ్చారు. ఇందులో శృతిరాజ్, గజాలా అక్కా చెల్లెళ్లు. చిన్న నాటి స్నేహితుడి కోసం శృతి రాజ్ పెళ్ల చేసుకోకుండా ఉంటుంది. ఆ తరువాత చెల్లెలు గజాలా రాజాతో ప్రేమలో పడ్డాక వారి ప్రేమను గెలిపించుకునేందుకు శ్రీకాంత్ ను రంగంలోకి దించుతారు. ఆ తరువాత సినిమాలో జరిగే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. కామెడీ , లవ్, సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా అప్పట్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే శ్రీకాంత్ కెరీర్ లో ఇదో మైలురాయిగా నిలిచింది.

ఇందులో శృతిరాజ్ శ్రీకాంత్ సరసన నటించింది. వీరి మధ్య సాగే ప్రేమాయణం ఆకట్టుకుంటుంది. అయితే ఓ చినదాన సినిమా తరువాత శృతిరాజ్ మరోసారి తెలుగులో కనిపించలేదు. కానీ తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమె సోనిగా పేరు మార్చుకుంది. ప్రస్తుతం సోని కొన్ని సీరియళ్లలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే అందరి లాగే శృతిరాజ్ అలియాస్ సోని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలను అప్లోడ్ చేసి ఆకట్టుకుంటోంది. అయితే శృతిరాజ్ అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆమె అందంలో ఎటువంటి మార్పులు లేదు. దీంతో ఆమె పిక్స్ కు లైకులు కొడుతారు. మరికొందరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version