https://oktelugu.com/

OG Movie: సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య!

పూర్తి వివరాల్లోకి వెళ్తే డీవీవీ దానయ్య నిర్మాతగా, న్యాచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో 'సరిపోదా శనివారం' అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 29 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం మొత్తం ఫుల్ బిజీ గా ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 21, 2024 / 03:27 PM IST

    OG Movie(1)

    Follow us on

    OG Movie: అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు తీస్తే హద్దులు దాటిన ఉత్సాహంతో ఎలా అయితే సందడి చేసి రచ్చ చేస్తారో, ‘ఓజీ’ పేరు తీసినప్పుడు కూడా అంతే ఉత్సాహంతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియా లో ఓజీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవ్వడం మనం ఎన్నోసార్లు గమనించాము. నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న రూమర్ ని ఒక ప్రముఖ వెబ్ సైట్ వెయ్యగా, నిమిషాల వ్యవధిలోనే నేషనల్ వైడ్ గా టాప్ 1 స్థానంలో ‘ఓజీ’ చిత్రం పేరు ట్రెండ్ అయ్యింది. నేడు నిర్మాత డీవీవీ దానయ్య సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నుండి ట్రీట్ ఉంటుంది అని కాసేపటి క్రితమే ఖరారు చెయ్యడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే డీవీవీ దానయ్య నిర్మాతగా, న్యాచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ‘సరిపోదా శనివారం’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 29 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం మొత్తం ఫుల్ బిజీ గా ఉంది. అందులో భాగంగా నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత డీవీవీ దానయ్య తో పాటుగా నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పాల్గొన్నారు. ఒక విలేఖరి దానయ్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఓజీ టీజర్ వస్తుందని ఆశిస్తున్నారు..మరి నిజంగానే వస్తుందా’ అని అడగగా, దానికి దానయ్య సమాధానం చెప్తూ ‘ అవును..వస్తుంది’ అని అంటాడు. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా పండగ వాతావరణంలోకి వెళ్లిపోయారు. అయితే అభిమానుల్లో చిన్న అయ్యోమయ్యం ఏర్పడింది, సెప్టెంబర్ 2న ఓజీ టీజర్ విడుదల అవుతుందా?, లేకపోతే మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల అవుతుందా అనే సందేహం లో ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా లో నిర్మాతలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    అధికారిక ప్రకటన మరో రెండు మూడు రోజుల్లో ఉండే అవకాశం ఉంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్, మూవీ లవర్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులకు ఈ గ్లిమ్స్ వీడియో చూడనిదే రోజు కూడా మొదలు అవ్వదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి గ్లిమ్స్ పెంచిన అంచనాలను సెప్టెంబర్ 2న విడుదల అవ్వబోయే ఓజీ కంటెంట్ లో ఉండబోతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఉంటే మాత్రం ఈ చిత్రం మీద అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.