https://oktelugu.com/

Sunita Williams : సమోసా, గణేశుడి ప్రతిమ, భగవద్గీత.. నింగిలోనూ సునీత భారతీయత..

Sunita Williams : డాలర్ల వేటలో పడి సొంత దేశంలో పౌరసత్వాన్ని వదులుకుంటున్న రోజులు ఇవి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మాతృదేశాన్ని మర్చిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి కాలంలో సునీత విలియమ్స్ (Sunita Williams) చేసిన పని ఆమెలో ఉన్న భారతీయతను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది. త్రివర్ణ పతాకం పై ఆమెకు ఉన్న మమకారాన్ని స్పష్టం చేసింది.

Written By: , Updated On : March 19, 2025 / 12:58 PM IST
Sunita Williams

Sunita Williams

Follow us on

Sunita Williams : సునీత విలియమ్స్ కు భారతీయ మూలాలు ఉన్నప్పటికీ.. ఆమె అమెరికా దేశస్థుడిని పెళ్లి చేసుకుంది కాబట్టి.. ఆ ప్రాంత మహిళ అవుతుంది. పైగా ఆమె ఇప్పుడు నాసాలో పనిచేస్తోంది. అలాంటి మహిళ నింగిలోకి వెళ్తే అమెరికా పతాకంతో కనిపించాలి. అమెరికా జాతీయతను ప్రతిబింబించే విధంగా వ్యవహరించాలి. కానీ సునీత విలియమ్స్ అమెరికాకు కాకుండా భారతీయతకు తన తొలి ప్రాధాన్యమిచ్చింది. అంతేకాదు ప్రతి సందర్భంలోనూ తన జాతీయతను ఆమె ప్రదర్శించింది. నేటి కాలంలో చాలామంది భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న తరుణంలో.. జాతీయతను నూటికి నూరుపాళ్లు ప్రదర్శించి దేశంపై తనకు ఉన్న మమకారాన్ని చాటుకుంది.

Also Read : 8 రోజులు అనుకుంటే 9 నెలలు పట్టింది.. సునీత విలియమ్స్ తదుపరి ప్లాన్ ఏంటంటే..

భారతీయ మహిళ

సునీత తండ్రి పేరు దీపక్ పాండ్యా. ఆయనది గుజరాత్ రాష్ట్రం. అమెరికాలో న్యూరో అనాటమిస్ట్ గా పని చేసేవాడు. సునిత తల్లి పేరు ఉర్స్ లైన్ బోని.. ఈమె సొంత దేశం స్లోవేకియా. వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఉర్స్ లైన్ బోనీ, దీపక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు. దీపక్ పాండ్యాది గుజరాత్ రాష్ట్రంలోని ఝులసన్ గ్రామం.. 1957 లోనే దీపక్ పాండ్యా ఎండి పూర్తి చేశారు. అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడ వివిధ ఆస్పత్రులు.. ప్రయోగ కేంద్రాలలో పనిచేశారు. ఇక సునీత నావీలో చేరినప్పుడు ఫెడరల్ మార్షల్ జె. విలియమ్స్ ను వివాహం చేసుకున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. సునీత 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టం కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్ గా ఆమె పని చేశారు. మధ్యధర, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రాలలో ఆమె విధులు నిర్వహించారు. భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆమె సొంతం. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2007లో అంతరిక్షంలో మార థాన్ చేసిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. సునీత భారత్, స్లోవేనియా సంప్రదాయాలను పాటిస్తారు. ఒకసారి స్లోవేనియా జాతీయ పతాకాన్ని తీసుకెళ్లారు. ఆ దేశానికి సంబంధించిన ఒక తినుబండారాన్ని కూడా వెంట తీసుకువెళ్లారు. ఇక మన దేశానికి సంబంధించి ఆలూ సమోసా, గణపతి విగ్రహాన్ని ఆమె తన వెంట తీసుకెళ్లినట్టు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. సునీత క్రైస్తవుడిని వివాహం చేసుకున్నప్పటికీ హిందూ మతాన్ని ఆచరిస్తారు. 2006లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భగవద్గీత పుస్తకాన్ని తీసుకెళ్లారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఓమ్ గుర్తును, ఉపనిషత్తుల కాపీని ఆమె తన వెంట పట్టుకుని వెళ్లారు.

Also Read : నింగి నుంచి నేలకు.. 9 నెలల నిరీక్షణ ఫలించిన వేళ.. క్షేమంగా ల్యాండ్‌ అయిన సునీత విలియమ్స్‌..