Anchor Geethanjali: మనిషి అందాన్ని పెంచడంలో జుట్టుదే ప్రధాన పాత్ర. అందమైన నల్లటి రంగుతో ఒత్తుగా జుట్టు ఉండాలని ప్రతీఒక్కరూ భావిస్తారు. రకరకాల క్రాఫ్ తో లెటెస్ట్ ట్రెండుకు తగ్గట్టు జుట్టును కత్తిరించుకుంటారు కుర్రకారు. సమయం దొరికితే చాలు సెలూన్ షాపులో గంటల తరబడి గడుపుతుంటారు. ఇక మహిళల కేశాలంకరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. జుట్టు సంరక్షణకు వారు తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీకావు. అయితే మారుతున్న ఆహార అలవాట్లు, కాలుష్యం పుణ్యమా అని జుట్టు రాలిపోతోంది. రెండు పదుల వయసులో బట్ట తల వస్తోంది. దీంతో తలపై జుట్టు మొలిపించేందుకు కుర్రకారు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రధానంగా అనారోగ్య సమస్యలతోనే జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కేన్సర్ పెషెంట్స్ లో ఈరకమైన రుగ్మత అధికం. కేన్సర్ కణాలను నియంత్రించేందుకు కీమోథెరపీ చేస్తారు. దీని వల్ల రోగికి సైడ్ ఎఫెక్ట్స్ అధికం. వాటిలో ముఖ్యమైనది జుట్టు రాలిపోవడం. బరువు తగ్గిపోవడం. అందుకే కేన్సర్ పేషెంట్స్ కి చికిత్స ముందు గుండు చేయిస్తారు. కేన్సర్ పెషెంట్లు చాలా మంది విగ్గులు ధరిస్తారు. తాత్కాలిక పరిష్కార మార్గంగా విగ్గులనే ఆశ్రయిస్తారు.

అయితే కేన్సర్ పెషెంట్ల విగ్గుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు జుత్తును సేకరిస్తున్నాయి. అటువంటి ఆర్గనైజేషన్ ను ఉదయ్ అనే వ్యక్తి చాలా యాక్టివ్ గా రన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ వేలాది మంది కేన్సర్ బాధితులకు ఆయన జుట్టును సేకరించి అందించగలిగారు. సర్వీస్ ఓరియెంటెడ్ సాగుతున్న ఉదయ్ జర్నీని సమాజానికి స్ఫూర్తిగా చూపాలని సుమన్ టీవీ నిర్ణయించింది. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కేన్సర్ రోగి ఎదుర్కొనే పరిస్థితులు, వారి భావోద్వేగాలను విన్న యాంకర్ గీతాంజలి చలించిపోయారు. ఆర్గనైజర్ ఉదయ్ చెప్పే మాటలకు ఇన్ స్పైర్ అయి అక్కడికక్కడే తన జుట్టును దానం చేసేందుకు ముందుకొచ్చారు. స్పాట్ లోనే జుట్టుదానం చేసి ఆదర్శంగా నిలిచారు. నెట్టింట్లో ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. యాంకర్ గీతాంజలికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంచి స్ఫూర్తిని నింపారని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక జుట్టు దానంచేసి కేన్సర్ బాధితులను ఆదుకోవాలని ఉదయ్ కోరుతున్నారు. జుట్టు దానం చేయాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు. హెయిర్ డొనేట్ చేయాలనుకునే వారు ముందుగా తలస్నానం చేసుకోవాలి. హెయిర్ ను పొడిగా ఉంచుకోవాలి. లైట్ కలర్ డ్రస్ వేసుకుంటే కొలతలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే జట్టు 12 అడుగుల పొడవు ఉండేవారే ఇలా దానం చేయడానికి అర్హులని ఉదయ్ చెబుతున్నారు. అటువంటి వారు మాత్రమే కాంటాక్ట్ కావాలని కోరుతున్నారు. ప్రస్తుతం అటు యాంకర్ గీతాంజలి, ఇటు ఆర్గనైజర్ ఉదయ్ ల వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి.