HomeజాతీయంBaba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా?

Baba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా?

Baba Vanga Predictions: జ్యోతీష్యం ప్రపంచంలో ఇప్పుడు ప్రాచుర్యం పొందిన ఒక అంశం. అయితే అది నమ్మకంపై ఆధారపడుతుంది. ఒక్కోసారి జోష్యాలు నిజమైన సందర్భాలున్నాయి. అయితే చాలావరకూ తేలిపోయిన సిచ్యువేషన్లూ అధికమే. జోష్యం చెప్పినవారి వాక్ శుద్ధి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది జ్యోతీష్యంపై పిచ్చి నమ్మకం పెట్టుకుంటారు. అయితే జ్యోతీష్యం తో భవిష్యత్ విషయాలు తెలుసుకొని చాలా మంది మదనపడుతుంటారు. సుఖం ఉంటుందని చెబితే సంతోషపడతారు. అవే బాధలు ఉంటాయని తెలిస్తే మాత్రం లోలోన కుమిలిపోతారు. ఇప్పుడు ఇండియా పరిస్థితి అలానే ఉంది. వచ్చే మూడు నెలల్లో ఇండియా కరువుకాటకాలతో ఇబ్బందిపడుతుందని వేంగా బాబా జోష్యం చెప్పారు. 2022లో ఇండియాకు కరువు తప్పదని హెచ్చరించారు. అయితే బాబా చెప్పినట్టుగా జరిగితే ఈపాటికే జరిగి ఉండేది. కానీ బాబా నోటి వాక్కుపై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో నమ్మకం. బాబా చెప్పింది చాలావరకూ జరిగింది. అంటే బాబా చెప్పినట్టు జరిగితే మాత్రం.. ఇండియాకు ఈ మూడు నెలల పాటు సంక్టిష్ట సమయమన్న మాట. దీనిపై దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జ్యోతీష్యంపై నమ్మకం ఉన్న వారు కష్టాలు తప్పవని ఫిక్సవుతున్నారు.

Baba Vanga Predictions
Baba Vanga Predictions

బల్గేరియాకు చెందిన వేంగా బాబా జ్యోతీష్యం చెప్పడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటనలను ముందుగానే బాబా తన జ్యోతీష్యం ద్వారా వెల్లడించారు. ప్రపంచానికి ఎదురైన రెండు అపాయాలను బాబా ముందుగానే చెప్పారు. భవిష్య వాణిని ముందుగానే వెల్లడించారు. అయితే ఆయన చెప్పిన ఆరింటిలో రెండు మాత్రమే నిజమయ్యాయి. ఆస్ట్రేలియాకు వరదలు తప్పవని హెచ్చరించారు. అలానే వరదలు చుట్టుముట్టాయి. పాకిస్తాన్ కు కూడా వరద ముప్పు ఉంటుందని చెప్పారు. అక్కడ కూడా అదే జరిగింది. కొన్ని దేశాల్లో నీటి కొరత ఎదురవుతుందని హెచ్చరించారు. 2022 తరువాత సైబిరియాలో ఓ కొత్తరక వేరియంట్ వైరస్ వస్తుందని కూడా హెచ్చరించారు. అంతే కాకుండా మిడతల దండు, ఏలియన్స్ దాడులు, వర్చువల్ రియాలిటీ అభివృద్ధిలో కూడా జోష్యం చెప్పారు.

Baba Vanga Predictions
Baba Vanga Predictions

అయితే ఇండియాకు హెచ్చరించినట్టుగా 2022లో విపత్తు తప్పదని హెచ్చరించారు. కరువురాజ్యమేలుతుందని కూడా చెప్పారు. కానీ బాబా చెప్పిన కాలంలో ఎనిమిది నెలలు కరిగిపోయాయి. ఉన్నది అటు ఇటుగా 100 రోజులు మాత్రమే. కానీ బాబా అటు ప్రపంచ ఉష్ణోగ్రతలను అనుసంధానిస్తూ దాని పర్యవసానాలు ఇండియాపై పడతాయని చెప్పుకొచ్చారు. అంటే ఇండియాలో ఉష్ణోగ్రతలు తగ్గి పంట పొలాలపై మిడతలు దాడిచేస్తాయని.. సర్వనాశనం చేస్తాయని.. తద్వారా కరువు ఫరిడవిల్లుతుందని జోష్యం చెప్పారు. దానికి తగ్గట్టుగానే దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వేంగా బాబా చెప్పిన ప్రమాద ఘంటికలు తప్పవా? అని ఇండియన్స్ ఆందోళన చెందుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version