Ram Charan- Director Shankar: డైరెక్టర్ శంకర్ కి చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడన్న న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ వార్త నిజమే అంటున్నారు. శంకర్ కి చిరు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటో చూద్దాం. శంకర్ హీరో రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నారు. R C-15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా శంకర్ కి మరో బాధ్యత వచ్చిపడింది. ఆయన భారతీయుడు 2 షూట్ పూర్తి చేస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చాడు. వివాదాలతో భారతీయుడు 2 కొన్నాళ్ల క్రితం ఆగిపోయింది. శంకర్ తో నిర్మాతలకు సయోధ్య కుదరడంతో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేస్తానని ఒప్పుకున్నాడు.

మరి చరణ్ మూవీ సంగతేమిటని అడిగితే ఏక కాలంలో రెండు చిత్రాలను పర్యవేక్షిస్తా అన్నారు. తీరా చూస్తే చరణ్ మూవీ సెట్స్ లోకి రావడమే శంకర్ మానేశాడట. కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ చరణ్ చిత్ర షూటింగ్ బాధ్యతలు నెరవేరుస్తున్నారట. ఈ విషయమై శంకర్ వద్ద ఒకటి రెండు సార్లు చరణ్ అసహనం వ్యక్తం చేశాడట. అయినా తీరు మారకపోవడంతో చిరంజీవి రంగంలోకి దిగారట. శంకర్ కి ఫోన్ చేసి గట్టిగా చెప్పాడట. చరణ్ మూవీ చిత్రీకరణ శంకర్ డైరెక్షన్ లోనే జరగాలని వార్నింగ్ ఇచ్చాడట. ఆర్ ఆర్ ఆర్ వంటి హిట్ తర్వాత చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని గట్టిగా చెప్పాడట.
Also Read: Karanam Dharmasri Resigns: ఉత్తరాంధ్రలో వైసీపీ గేమ్ స్టాట్.. ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా
ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత కాగా, కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ రెండు మూడు భిన్నమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ లుక్స్ కొన్ని లీక్ అయ్యాయి. పంచ కట్టులో సైకిల్ పై వెళుతున్న చరణ్ గెటప్ ఆసక్తి రేపుతోంది. ఆర్సీ 15లో పీరియాడిక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని వినికిడి. ఆచార్య రామ్ చరణ్ కి షాక్ ఇచ్చిన నేపథ్యంలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నారు.

భారతీయుడు 2 కారణంగా రామ్ చరణ్ మూవీ విడుదల ఆలస్యం కావడం ఖాయం. ఇకనైనా భారతీయుడు 2 షూట్ త్వరగా పూర్తి చేసి రామ్ చరణ్ మూవీపై శంకర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన శంకర్ రామ్ చరణ్ మూవీలో పాటలు, ఫైట్స్ భారీ ఎత్తున గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.