https://oktelugu.com/

Duvvada Srinivas: ఇతడేమో కాలభైరవ.. ఆమె మిత్రవింద.. చూసే జనాలు వెర్రివాళ్లు.. వైరల్ వీడియో

Duvvada Srinivas సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రకరకాల వీడియోలు అందుబాటులోకి రావడం మొదలైంది. అందుకే కొన్ని వీడియోలు గొప్పగా ఉంటే.. మరికొన్ని వీడియోలు చెత్తగా ఉంటున్నాయి. ఆ జాబితాలో ఈ వీడియోకు ప్రథమ స్థానం ఇవ్వచ్చు.

Written By: , Updated On : March 19, 2025 / 04:14 PM IST
Duvvada Srinivas And Madhuri

Duvvada Srinivas And Madhuri

Follow us on

Duvvada Srinivas: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయినప్పటికీ.. ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో, మీడియాలో విపరీతమైన హైప్ ఎంజాయ్ చేస్తున్నారు. మాధురితో సాగిస్తున్న “సమ్ బంధం” వెలుగులోకి రావడం.. అది కాస్త మీడియాలో పడి సంచలనం కావడంతో.. దువ్వాడ శ్రీనివాస్ – మాధురి ఒకసారి హాట్ టాపిక్ అయిపోయారు. గత ఏడాది చివరి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అటు మీడియా.. ఇటు సోషల్ మీడియా వీరి చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే మాధురి వకుళ సిల్క్స్ పేరుతో హైదరాబాదులో చీరల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీవల దానిని ప్రారంభించారు. దానిని కూడా సోషల్ మీడియాలో కొన్ని యూ ట్యూబ్ చానల్స్ విపరీతంగా ప్రమోట్ చేశాయి.అంతేకాదు వకుళ సిల్క్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అనే రేంజ్ లో డబ్బాలు కొట్టాయి.. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పనే అది కదా.. జాకీలు పెట్టి లేపడం.. పేమెంట్లు తీసుకోవడం.. ఇలానే కదా అవి చేస్తున్నది.

వందల సంవత్సరాల ప్రేమ కథ అట..

దువ్వాడ శ్రీనివాస్ – మాధురి ప్రేమ కథకు సంబంధించి అనేక రకాల కోణాలను యూట్యూబ్ చానల్స్ బయటపెట్టాయి. కొత్తగా వారిద్దరి మధ్య సంబంధాన్ని బయటి ప్రపంచానికి చెప్పడానికి ఏమీ లేదు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ మాత్రం వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను సరికొత్త యాంగిల్ లో ఆవిష్కరించింది. దువ్వాడ శ్రీనివాస్ – మాధురి మధ్య ప్రేమ ఇప్పుడు పుట్టలేదట. వారి ప్రేమ కథకు వందల సంవత్సరాల చరిత్ర ఉందట. దానికి మగధీర సినిమా అంత రేంజ్ ఉందట. ఆ సినిమాలో కాలభైరవ, మిత్ర వింద పాత్రల మధ్య ఎంతటి గాఢమైన ప్రేమ ఉందో.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య కూడా అంతకుమించి అనే రేంజ్ లో ప్రేమ ఉందట. ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం ఈ జన్మలో వారు ఈ స్థాయిలో ప్రతి బంధకాలు ఎదుర్కొంటున్నారట.. ఈ వీడియోను కాస్త సదరు యూ ట్యూబ్ చానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు తగలు కోవడం మొదలుపెట్టారు. ” ఆమె మిత్రవింద.. ఇతడు కాలభైరవ.. చూసేవాళ్ళు మొత్తం పిచ్చివాళ్లు.. లేకపోతే మరేమిటి.. అతని వయసు ఏంటి.. ఆమె వయసు ఏంటి.. ఇద్దరి మధ్య ప్రేమ ఏంటి.. మీడియా, సోషల్ మీడియా ఈ స్థాయిలో దిగజారడం ఏంటి.. చూస్తుంటే ఇబ్బంది కలుగుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే విరక్తి కలుగుతున్నది. ఇప్పటికే వారిని చూసి చూసి విసుగు వస్తోంది. ఇప్పటికైనా వారు మారాలని ఆశిస్తున్నామని” నెటిజన్లు పేర్కొంటున్నారు.