Allu Arjun-Atlee Movie Title Leaked: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో సినిమా పరుగులు పెడుతోంది. నిన్న గాక మొన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారో లేదో, అప్పుడే గుట్టు చప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు ప్రారంభం అవ్వడం, ఆ తర్వాత ముంబై లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు అవ్వడం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. నిన్న ముంబై లో అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ అట్లీ. ఈ చిత్రం లో మృణాల్ ఠాకూర్ తో పాటు దీపికా పదుకొనే(Deepika Padukone), జాన్వీ కపూర్(Jhanvi Kapoor) లు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళు మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ చిత్రం లో నటించబోతున్నారు. దీపికా పదుకొనే కి సంబంధించి భారీ ప్రకటన ఒక వీడియో ద్వారా ఈమధ్యనే తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే.
మరి మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లకు ఆ రేంజ్ బిల్డప్ ఎందుకు ఇవ్వలేదు?, దీపికా పదుకొనే ముందు డైరెక్టర్ వాళ్ళను తక్కువ చేస్తున్నాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో జరుగుతుంది. ఈ చిత్రానికి రెండు టైటిల్స్ లో ఒక టైటిల్ దానిని ఎంచుకోవాలని నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక టైటిల్ ‘శక్తి మాన్’, మరో టైటిల్ ‘ఐకాన్’. ఈ రెండిట్లో ఎదో ఒక టైటిల్ కచ్చితంగా రాబోయే రోజుల్లో ఖరారు అవ్వబోతుందట. రెండు టైటిల్స్ కూడా అదిరిపోయాయి. ‘శక్తి మాన్’ అనే టైటిల్ కి సెన్సేషనల్ రీచ్ ఉంటుంది. మన చిన్నతనం నుండి టీవీ లో శక్తి మాన్ అనే పాపులర్ సీరియల్ ని చూసి ఈ టైటిల్ కి అలవాటు పడ్డాము. అందుకే ఈ టైటిల్ కి ఉన్నంత రీచ్ ఏ టైటిల్ కి కూడా ఉండదని మేకర్స్ భావిస్తున్నారట.
Also Read: Allu Arjun and Atlee : అల్లు అర్జున్ అట్లీ మూవీలో నటించనున్న తమిళ స్టార్ హీరో..?
మరికొద్ది రోజుల్లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఈ టైటిల్ ని లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సూపర్ హీరో పాత్ర చేయబోతున్న సంగతి తెలిసింది. రెండు వేర్వేరు ప్రపంచాలు సంబంధించిన అన్నదమ్ముల స్టోరీ ఇది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లోనే కాదు, హాలీవుడ్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు. అందుకే ఈసారి కొడితే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే 2027 సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టేసాడు.