Peddi Movie : ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను ఏర్పాటు చేసిన చిత్రాల్లో ఒకటి ‘పెద్ది'(Peddi Movie). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), బుచ్చి బాబు(Buchi Babu sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ స్థాయి అంచనాలు ఏర్పడడానికి కారణం శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ‘గ్లింప్స్’ వీడియో నే. ఈ గ్లింప్స్ చివర్లో వచ్చే పెద్ది షాట్ ఎంత ఫేమస్ ఐయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఇప్పటి వరకు ఇలాంటి షాట్ ప్రయత్నం చేయలేదు. చూసేందుకు చాలా కొత్తగా, పవర్ ఫుల్ గా అనిపించింది ఈ షాట్. సోషల్ మీడియా లో ఈ షాట్ ని అనుకరిస్తూ ఎన్నో స్పూఫ్ వీడియోలు కూడా వచ్చాయి. IPL సీజన్ సందర్భంగా అన్ని టీమ్స్ కూడా సోషల్ మీడియా లో ఈ షాట్ ని అప్లోడ్ చేస్తూ వచ్చాయి.
Also Read : అఖండ 2′ లో విజయశాంతి..ఎలాంటి పాత్రలో కనిపించబోతుందంటే!
ఈ షాట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం బుచ్చి బాబు అని అభిమానులు సోషల్ మీడియా లో చెప్తూ వచ్చారు. రీసెంట్ గానే బుచ్చి బాబు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో పెద్ది షాట్ గురించి ఆయన ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది ఈ గ్లింప్స్ లోని షాట్ అంత అద్భుతంగా రావడానికి కారణం నేనే అని అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నాకు రొటీన్ గా కాకుండా పెద్ది షాట్ అనే సిగ్నేచర్ ఉండేలా ఒక షాట్ కావాలని నవకాంత్ మాస్టర్ ని కోరాను. ఆయన ఈ షాట్ ని ప్రిపేర్ చేసాడు. క్రెడిట్స్ మొత్తం ఆయనకే దక్కాలి. రామ్ చరణ్ గారు కూడా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా చాలా గొప్పగా ఆ షాట్ చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు.
థియేటర్ లో ఇలాంటి సన్నివేశాలు, జిమ్మిక్స్ ని చూసి ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. రామ్ చరణ్ ఇందులో కేవలం క్రికెట్ ఆటగాడు అనుకుంటే పెద్ద పొరపాటే. అతను ఒక కబ్బడి ఆటగాడు, కుస్తీ ఆటగాడు, ఫుట్ బాల్ ఆటగాడు ఇలా ఒక్కటా రెండా అన్ని ఆటల్లో అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నవాడు. కథ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది కదూ. మారుమూల గ్రామంలో తనకు ఉన్న అద్భుతమైన టాలెంట్ కి గుర్తింపు దక్కడం కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధమే ఈ సినిమా. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అదే విధంగా ఈ సినిమాలో ఇతర బాలీవుడ్ నటీనటులు కూడా కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?