https://oktelugu.com/

కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడడం సినీ పరిశ్రమతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కుటుబం మొత్తం ప్రాణాంతక మహమ్మారిని జయించింది. ఆసుపత్రిలో ఉన్న అభిషేక్‌ బచ్చన్‌ కూడా కోలుకొని డిస్చార్జ్ కావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలా సోకిందో ఏమో గానీ అమితాబ్‌ మొదట వైరస్‌ బారిన పడ్డారు. ఆవెంటనే అభిషేక్‌కు పాజిటివ్ అని తేలింది. అనుమానంతో కుటుంబ సభ్యులంతా పరీక్షలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 8, 2020 6:10 pm
    Follow us on

    Abhishek Bachchan

    ఇండియన్‌ సూపర్ స్టార్, బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడడం సినీ పరిశ్రమతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కుటుబం మొత్తం ప్రాణాంతక మహమ్మారిని జయించింది. ఆసుపత్రిలో ఉన్న అభిషేక్‌ బచ్చన్‌ కూడా కోలుకొని డిస్చార్జ్ కావడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలా సోకిందో ఏమో గానీ అమితాబ్‌ మొదట వైరస్‌ బారిన పడ్డారు. ఆవెంటనే అభిషేక్‌కు పాజిటివ్ అని తేలింది. అనుమానంతో కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోగా.. ఐశ్వర్యారాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యా కూడా వైరస్‌ బారిన పడినట్టు తేలింది. అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌ ఇతర ఫ్యామిలీ మెంబర్లకు మాత్రం నెగిటివ్‌ అని తేలింది. తొలుత అమితాబ్‌, అభిషేక్‌ ముంబై నానావతి ఆసుపత్రిలో జాయిన్‌ కాగా.. తర్వాతి రోజు ఐశ్వర్యా రాయ్‌, ఆరాధ్య కూడా హాస్పిటల్‌లో చేరారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఐశ్వర్య, ఆరాధ్య కోలుకొని డిస్చార్జ్‌ అయ్యారు.

    Also Read: అడిగినంత ఇవ్వలేదని.. చేయనంటుంది !

    పెద్ద వయసు, ఇతర సమస్యలు కూడా ఉండడంతో అమితాబ్‌ ఆరోగ్యంపై అందోళన మొదలైంది. ఆసుపత్రిలో తాను ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నానని కూడా సీనియర్ బచ్చన్‌ ట్వీట్‌ చేశాడు. కానీ, అభిమానుల ప్రార్థనలతో ఆయన కూడా కోలుకొని కొన్ని రోజుల కిందటే ఇంటికి చేరుకున్నాడు. అయితే, తండ్రి, భార్య, కూతురు కోలుకున్నప్పటికీ అభిషేక్‌ మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండడం పలు అనుమానాలకు దారి తీసింది. అతని ఆరోగ్యం క్షీణించిందేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అభిషేక్‌ కూడా కరోనాను జయించాడు. ఈ రోజు నిర్వహించిన టెస్టులో నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి డిస్చార్జ్‌ చేశారు. దాంతో అతను ఇంటికి చేరుకున్నాడు. ‘ప్రామిస్‌ అంటే ప్రామిసే. నాకు చేసిన పరీక్షల్లో ఈ రోజు మధ్యాహ్నం నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. నేను ఈ మహమ్మారిని జయిస్తానని మీకు చెప్పాను కాదా. చేసి చూపించా. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు. నానావతి హాస్పిటల్‌ డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌కు నేనెప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్యూ’ అని అభిషేక్‌ ట్వీట్‌ చేశాడు. అభిషేక్‌ ట్వీట్‌ను షేర్ అమితాబ్‌… ‘వెల్‌కమ్‌ హోమ్‌ భయ్యూ… గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌’ అని ట్వీట్‌ చేశాడు.