https://oktelugu.com/

Lata Mangeshkar: షాకింగ్ : లతా మంగేష్కర్ పరిస్థితి విషమం

Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అందుకే, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా లతా మంగేష్కర్ లేటెస్ట్ హెల్త్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 03:47 PM IST
    Follow us on

    Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమెకి కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు. అందుకే, ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఆమె హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Lata Mangeshkar

    కాగా లతా మంగేష్కర్ లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ వచ్చింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమించినట్లు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సందానీ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గతనెల మొదట్లో కరోనా బారినపడ్డ లతా మంగేష్కర్‌ను జనవరి 11న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

    Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    రెండ్రోజుల క్రితం నుంచి ఆమెకు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు లతా మంగేష్కర్ ఆరోగ్యయ పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇలాగే స్పందించారు. ఇక లతా మంగేష్కర్ కి కరోనా సోకినప్పటి నుంచి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వయసు రీత్యా ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని.. ఇన్‌ఫెక్షన్లతో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

    Lata Mangeshkar

    కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. అలాగే లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి బాగు పడుతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

    Also Read: మీ వ్యక్తిత్వం మహోన్నతంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించాలి… ఆచార్య చాణిక్యుడు!

    Tags