Job Courses: టెన్త్, ఇంటర్ అర్హతతో కొందరు ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. వెంటనే ఉపాధి పొందాలంటే తగిన నైపుణ్యం కోసం కొన్ని సర్టిఫికెట్ కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులు పూర్తి చేస్తే టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఉపయోగపడే జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల గురించి తెలుసుకుందాం.
కంప్యూటర్ కోర్సులు..
టెన్త్, ఇంటర్ అర్హతతోనే కంప్యూటర్ స్కిల్స్ పెంచుకునేందుకు పలు సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ, ఎస్‌ఏపీ, కోర్ జావా ప్రోగ్రామింగ్, అడ్వాన్స్‌డ్ జావా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, సీ++, ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ వంటి కోర్సులు ఉన్నాయి.
మూడు నెలల నుంచి ఏడాది కోర్సులు..
ఈ కోర్సులు పూర్తి చేయడానికి మూడు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఎన్‌ఎస్‌డీసీ ఐటీ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనూ ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంది. ఈకోర్సులను పూర్తి చేస్తే ఐటీ, ఐటీ అనుబంధ విభాగాల్లో అసిస్టెంట్స్, సపోర్టింగ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.