
Mahesh Trivikram movie: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లాంటి అన్ని హంగులు ఉన్న హీరోను సరిగ్గా వాడుకోవాలే కానీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చు. కానీ ఇప్పటిదాకా మన దర్శకులు అంతలా మహేష్ బాబును చూపించలేదనే చెప్పాలి. పోకిరీ, ఒక్కడు మరికొన్ని మూవీలు తప్పితే పెద్ద ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలేవి తీయలేదనే చెప్పాలి.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారి పాట’ మూవీ చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడంతో మహేష్ కోసం త్రివిక్రమ్ (Trivikram) ఎలాంటి మూవీ రూపొందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.
‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా త్రివిక్రమ్ తాజా చిత్రాన్ని రూపొందించబోతున్నాడని తెలుస్తోంది.
మహేష్ తో సినిమా కోసం ఇప్పటికే త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసేశాడట.. అంతేకాదు.. దీనికి డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు. థమన్ కూడా ఇప్పటికే ఈ సినిమా కోసం పాటను రెడీ చేసే పనిలో పడ్డాడని సమాచారం. మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని సమాచారం.
క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ లో చాలా మంది సెంటిమెట్లను నమ్ముతుంటారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మహేష్ తో తీసే సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడట.. ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారట.. ఇక మరో భామ కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు హీరోయిన్లతో త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అందుకే అదే ప్లాన్ ను మహేష్ తో సినిమా కోసం కూడా అమలు చేస్తున్నాడట త్రివిక్రమ్.
అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో మహేష్ బాబు ‘రా’ ఎజెంట్ గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతోందట.. ఈ సినిమాకు ‘పార్ధు’, ‘అతడే పార్ధు’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.