Kangana Ranaut : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఆధునిక మహాభారత కీలక పాత్ర దారి జయలలిత (Jayalalitha) జీవితం ఆధారంగా రాబోతున్న సినిమా ‘తలైవి’. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) జయలలిత పాత్రలో ఒదిగిపోయింది. తానూ మరో జయను అంటూ తనకు తానే బిరుదు ఇచ్చుకునే రేంజ్ లో కంగనా జయ రాజకీయాన్ని ఒంటబట్టించుకుంది. కాగా సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఎలాగూ తాను కూడా కాబోయే మరో జయలలితను అని చెప్పుకుంటున్న కంగన ఈ రోజు ఉదయం చెన్నైకు చేరుకుని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించింది. ఈ సందర్భంగా కంగనా జయతో ఏదో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చింది. మరి జయతో కంగనా ఏమి చెప్పిందో ఆమెకే తెలియాలి. ‘తలైవి’ సినిమాకి విజయం అపజయం ఉండవు అని, ఎందుకంటే ఇది ఒక చరిత్ర అని, ఆ చరిత్రను రాసిన ఓ మహా మహిళ జీవితం అని కంగనా చెప్పుకొచ్చింది. అందుకే ఈ సినిమా అందరికీ చేరువ కావాలని, అవుతుంది అని కూడా తెలిపింది. ‘తలైవి’ ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడానికి కంగనా రెడీ అయింది.
అయితే, ‘తలైవి’ సినిమా రిలీజ్ కి కొన్ని సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఈ చిత్రం విడుదలకు సుముఖంగా లేదు. సినిమాలో చాలా సన్నివేశాలను తొలగించాలని స్టాలిన్ సన్నిహితులు ‘తలైవి’ నిర్మాతలను ఆదేశించారు. దాంతో కరుణానిధి తాలూకు కొన్ని సీన్స్ ను తీసేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
అసలు ఎప్పుడైతే తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితాన్ని తెర మీదకు తీసుకువస్తున్నాం అని ప్రకటించారో గానీ, అప్పటినుంచి ఈ సినిమాకి అనేక సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దీనికితోడు అమ్మ జీవితంలో చోటు చేసుకున్న అనేక వివాదాస్పద విషయాలను ఎలా చూపించాలి ? ఒకవేళ చూపించకపోతే సినిమాని అంగీకరించారు.
ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇదే జరిగింది. పైగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతే ఈ సినిమా నిర్మాత కూడా. అందుకే జయలలిత జీవితంలోని అపవాదులలో కొన్నిటిని టచ్ చేశారు. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి. కాగా ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.