Samantha Ice Bath: సమంత ఫిట్నెస్ ఫ్రీక్. అందం, ఆరోగ్యం కోసం చాలా నిబద్ధతగా ఉంటారు. రోజూ వ్యాయామం, యోగా చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తుంది. తన ఇంటి ఆవరణలో స్వయంగా కూరగాయలు, పండ్లు సాగు చేసి అవి తింటుంది. ఇంత జాగ్రత్తగా ఉన్నా సమంతను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆమె మయోసైటిస్ వ్యాధి బారినపడ్డారు. గత ఏడాది అక్టోబర్ లో సమంత ఈ విషయం వెల్లడించారు. కొన్నాళ్ళు సమంత ఇంటికే పరిమితమయ్యారు. చికిత్స తీసుకున్నారు.
కొంత కోలుకున్నాక తిరిగి షూటింగ్స్ లో బిజీ అయ్యారు. సమంత లేటెస్ట్ మూవీ ఖుషి, వెబ్ సిరీస్ సిటాడెల్ చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం సమంత ఖాళీగా ఉన్నారు. ఈ విరామ సమయాన్ని మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ నుండి ఉపశమనం కోసం ఉపయోగిస్తున్నారు. సమంత కొన్ని చికిత్సల కోసం ఇండోనేషియా వెళ్లారు. బాలీ ద్వీపంలో ప్రకృతి మధ్య గడుపుతున్నారు. బాలీ ద్వీపంలో ఏరియల్ యోగ చేసింది.
అలాగే సమంత ఒక సాహసానికి పాల్పడ్డారు. నాలుగు డిగ్రీల చల్లని నీళ్ల తొట్టిలో ఆరు నిమిషాల పాటు ఉంది. అంతటి చల్లని నీళ్లలో అంత సేపు గడపడం సామాన్యమైన విషయం కాదు. శరీరం చాలా బాధకు గురవుతుంది. మొండిదైన సమంత ఆ సాహసం పూర్తి చేసింది. ఇది కూడా ఒక విధమైన ట్రీట్మెంట్ అట. చల్లని నీళ్లల్లో కొన్ని నిమిషాలు స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట.
మరోవైపు సమంత సినిమాలకు విరామం ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండోనేషియా దేశం నుండి వచ్చాక అమెరికా వెళతారట. అక్కడ లాంగ్ టర్మ్ చికిత్సతీసుకుంటారట. సమంత అందుకే కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదట. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకుడు కాగా… విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల కానుంది. ఇక సిటాడెల్ యాక్షన్ సిరీస్. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.