Rishabh Pant: లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్ రిషబ్ పంత్ సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 86 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. టెస్టుల్లో పంత్ కు ఇది 17వ హాఫ్ సెంచరీ. ఇంగ్లాండ్ పై ఆరో అర్ధశతకం కావడం విశేషం. 60 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి భారత్ 221 పరుగులు సాధించింది. పంత్ 56 పరుగులు, కేఎల్ రాహుల్ 89 పరుగులతో క్రీజులో ఉన్నారు.