WhatsApp Changes: ప్రపంచంలో ఎక్కువ శాతం మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ గా వాట్సప్ అవతరించింది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల ప్రజలు వాట్సాప్ వాడుతున్నారు. సామాన్యుల నుంచి మొదలుపెడితే ప్రభుత్వాల వరకు ఈ మెసెంజింగ్ యాప్ ను ఉపయోగించడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. పైగా గవర్నింగ్ సేవల కోసం ప్రభుత్వాలు వాట్సాప్ ను వాడటం ఇటీవల మొదలైంది. దీనిని ఒక సాంకేతిక విప్లవం లాగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
వాట్సాప్ లో మొదట్లో కేవలం సందేశాలు మాత్రమే పంపడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సందేశాలు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని పంపించడానికి ఆస్కారం కలిగింది. ఇక వాట్సాప్ మేనేజ్మెంట్ మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు సరికొత్త అనుభూతి కలుగుతోంది. వాట్సాప్ యాజమాన్యం అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో యూజర్లు ఆ సాంకేతికతను అనుభూతి చెందుతున్నారు. తాజాగా వాట్సప్ యాజమాన్యం మరో మార్పును అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పటివరకు వాట్సాప్ లో కమర్షియల్ యాడ్స్ వచ్చేవి కాదు. పైగా సేవలలో అంతరాయం కలిగేది కాదు. అప్పుడప్పుడు సర్వర్ డౌన్ అయితే తప్ప వాట్సప్ ఇబ్బంది పెట్టేది కాదు. కానీ ఇప్పుడు వాట్సాప్ లో సమూల మార్పులను తీసుకొచ్చింది మేనేజ్మెంట్. యాడ్స్ ఆప్షన్ ను యాక్టివ్ చేసినట్టు వాట్సాప్ మేనేజ్మెంట్ మెటా ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ మాదిరిగానే యాడ్స్ కూడా మొదట స్టేటస్ ట్యాబ్లో కనిపిస్తాయి..చాట్ లిస్ట్ లో నాన్ ఇంట్రూసివ్ యాడ్ ప్లేస్ మెంట్ ను కూడా పరీక్షిస్తున్నట్టు మెటా వెల్లడించింది. అయితే యాడ్స్ వచ్చిన అంత మాత్రాన యూజర్ వ్యక్తిగత గోప్యతకు తాము భంగం కలిగించబోమని మెటా ప్రకటించింది. వ్యక్తిగత సందేశాలతో ప్రకటనలకు సంబంధం ఉండదని మెటా వెల్లడించింది. అంతేకాదు యాడ్స్ త్వరలో లైవ్ అవుతాయని మెటా పేర్కొంది.
Also Read: ఏఐ ఎఫెక్ట్.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్!
ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యుద్ధాల వల్ల వచ్చే ఆదాయం మెటా సంస్థకు తగ్గిపోయింది. దీనికి తోడు భవిష్యత్తు కాలంలో సాంకేతికపరంగా సేవలు మరింత విస్తారంగా అందించాల్సిన నేపథ్యంలో మెటా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే యాడ్స్ రూపంలో వచ్చే రెవెన్యూ మొత్తం భవిష్యత్తు సాంకేతికతకు వినియోగిస్తామని ఇటీవల కాలంలో మెటా అధిపతి జూకర్ బర్గ్ వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే వాట్సాప్ లో ఇప్పుడు ఈ మార్పులు రావడం విశేషం. మొదట్లో వెస్ట్రన్ కంట్రీస్ లో యాడ్స్ డిస్ ప్లే అవడం మొదలవుతుంది. ఆ తర్వాత మిగతా దేశాలలో ఈ మార్పు మొదలవుతుందని మెటా వెల్లడించింది. అయితే ఈ ప్రకటనలు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు యూజర్ గోప్యతకు ఏమాత్రం భంగం కలిగించకుండా ప్రదర్శింపజేస్తామని మెటా ఇప్పటికే వెల్లడించింది. దీంతో ప్రకటనలు యూజర్లకు ఇబ్బంది కలిగించని విధంగా ఉంటాయని సమాచారం.