Trivikram Venkatesh Movie: ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు… ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా మెగాస్టార్ గా తనను తాను విస్తరించుకున్నాడు. ఇక తనతో పాటుగా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటుడు సైతం మంచి విజయాలను సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం అయితే చేశారు. అలాంటి సందర్భంలోనే ఇప్పటికీ వాళ్ళు సీనియర్ హీరోలుగా మారిన తర్వాత కూడా మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరు ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారు…వాళ్ళ కథల సెలక్షన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వెంకటేష్ ఫ్యామిలీ సబ్జెక్టులను ఎక్కువగా చేస్తూ స్టార్ హీరోగా మారాడు. అలాగే కామెడీకి ప్రాధాన్యం ఉన్న పాత్రను పోషించడంలో ఆయనను మించిన నటుడు మరొకరులేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
Also Read: ఎవరెన్ని చెప్పిన ‘వార్ 2’ లో ఎన్టీఆర్ సెకండ్ హీరోనేనా..?
ఈ సినిమా వెంకటేష్ ఇంతకు ముందు చేసిన మల్లీశ్వరి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు అందించడంతో ఈ మూవీకి సీక్వెల్ ను చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి తొందరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా మల్లీశ్వరి సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుందా? లేదంటే ఫ్రెష్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందా అనేది ఇప్పుడు చర్చనియంశంగా మారింది.
Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను స్టార్ట్ చేసి సినిమా టైటిల్ ని అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తే గాని ఈ సినిమా మల్లీశ్వరి సినిమాకి సీక్వెల్ గా వస్తుందా? లేదంటే ఫ్రెష్ కథ తో తెరకెక్కుతోందా అనే విషయంలో క్లారిటీ అయితే రాదు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతోంది. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…