Pulivendula By-Election: పులివెందుల( pulivendula) విషయంలో తెలుగుదేశం పార్టీ ప్లాన్ ఏంటి? చిన్నపాటి జడ్పిటిసి ఉప ఎన్నికను ఆ పార్టీ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఏకగ్రీవ ఆనవాయితీని ఎందుకు బ్రేక్ వేసింది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబుది చివరి వరకు పోరాటం చేసే తత్వం. ఇది చాలా సందర్భాల్లో కూడా స్పష్టమైంది. విజయం అందుకునే వరకు ఆయన శ్రమిస్తూనే ఉంటారు. ఎన్నెన్ని ఇబ్బందులు వచ్చినా సడలరు. వెనక్కి తగ్గే మనస్తత్వం కూడా కాదు. ఇప్పుడు పులివెందుల విషయంలో అదే ధోరణితో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. వైసిపి వై నాట్ కుప్పం అన్న నినాదం కాకుండా.. చాపకింద నీరులా పులివెందులలో వైయస్ కుటుంబ హవాకు చెక్ పెట్టాలని గట్టి ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టమవుతోంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో.. జడ్పిటిసి ఎన్నిక అనే మాట వినని పులివెందులలో గట్టి అభ్యర్థిని రంగంలోకి దించారు.
Also Read: అర్ధరాత్రి పూట అవినాష్ రెడ్డి అరెస్టు.. పులివెందులలో ఏం జరుగుతోంది..
పక్కా ప్రణాళికతోనే
అయితే చంద్రబాబు( CM Chandrababu) వైఖరి చూస్తుంటే.. పోతే జుట్టు.. వస్తే కొండ అన్నట్టు ఉంది. కచ్చితంగా ఇక్కడ గట్టి పోటీ అయితే మాత్రం ఉంది. ఎప్పుడు సింగిల్ నామినేషన్ పడే పులివెందులలో.. 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1978 నుంచి ఆ నియోజకవర్గంలో వైయస్ కుటుంబానిదే పెత్తనం. వారు సూచించిన వ్యక్తి స్థానిక ప్రజాప్రతినిధి. ఫలానా మండలం నీది.. ఫలానా పదవి మీది అంటూ ఇచ్చేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న.. వారిదే హవా. అటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థిని నిలపాలంటే చిన్న పని కాదు. కానీ ఇప్పుడు అరుదైన అవకాశం చంద్రబాబుకు దక్కింది. వాస్తవానికి 2022లో ఇక్కడ జడ్పిటిసి సభ్యుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వైసీపీ అధికారంలో ఉంది. కానీ ఎన్నిక నిర్వహించలేదు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ చిన్నపాటి జడ్పిటిసి ఎన్నికను.. ఆ ఫలితాలను విశ్లేషించి.. జగన్మోహన్ రెడ్డిని తగ్గించాలన్న ప్రయత్నంలోనే ఈ ప్రతిష్టాత్మక పోరు.
ఆ కుటుంబానిదే ఆధిపత్యం
1978 నుంచి 2004 వరకు వైయస్ కుటుంబానిదే పులివెందుల నియోజకవర్గం. 1978, 1983, 1985లో రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhar Reddy ) హ్యాట్రిక్ విజయం సాధించారు. 1999, 2004, 2009లో గెలిచి రెండోసారి ఫ్యాక్టరీ కొట్టారు. 1989, 1994లో మాత్రం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1991 ఉప ఎన్నికల్లో వైయస్ పురుషోత్తం రెడ్డి గెలిచారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. మధ్యలో 2012లో వైయస్ విజయమ్మ ఎమ్మెల్యే అయ్యారు. ఇది పులివెందులలో వైయస్సార్ కుటుంబ ట్రాక్ రికార్డ్.
Also Read: సొంత వాహనాల్లోనే ‘మద్యం’ సొమ్ము.. సిట్ ఉచ్చులో ఆ ముగ్గురు!
తక్కువ ఓట్లతో ఎక్కువ ప్రచారం..
అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవాగా ఉన్న ఈ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వైసీపీ నేతల మాదిరిగా వై నాట్ అనే మాట రాకుండా.. చాలా సైలెంట్ గా తన ప్లాన్ వర్క్ అవుట్ చేశారు. బలమైన అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి భార్యను రంగంలోకి దించారు. ఒకటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లను బీటెక్ రవి దక్కించుకున్నారు. ఇప్పుడు పులివెందుల మండలంలో పదివేల 600 ఓట్లు ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాలు ఉన్నాయి. మొత్తం 2, 27,856 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కేవలం పులివెందుల మండలంలో ఉన్న ఓటర్లు 10, 600.. అయితే మొన్నటి ఎన్నికల్లో టిడిపి 24 శాతం ఓట్లను సాధించింది. ఈ లెక్కన టిడిపి 442 కంటే ఎక్కువ తెచ్చుకుంటే అసలు సిసలు విజయం దక్కించుకున్నట్టే. అది నాలుగు అంకెల ఓట్లు దక్కించుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి హవా తగ్గించినట్టే. పొరపాటున టిడిపి అభ్యర్థి నెగ్గితే.. ఈస్ట్ట్రాటజీని అనుసరించి పులివెందులలో వైయస్ కుటుంబ హవాను పూర్తిగా తగ్గిపోయిందని.. 2029 ఎన్నికల్లో విజయం టిడిపి దేనని బల్ల గుద్ది మరీ చెబుతారు. చంద్రబాబు ఈ లక్ష్యంతోనే టిడిపి శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరి ఫలితం ఎలా రాబోతుందో చూడాలి.