Homeఎంటర్టైన్మెంట్Baahubali The Epic Teaser in Coolie and War2 Theaters: కూలీ, వార్ 2...

Baahubali The Epic Teaser in Coolie and War2 Theaters: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?

Baahubali The Epic Teaser in Coolie and War2 Theaters: భారీ అంచనాల నడుమ వార్ 2, కూలీ పాన్-ఇండియా చిత్రాలుగా విడుదల అవుతున్న సంగతి మనకి తెలిసిందే..

వార్ 2 – యాక్షన్ ఎంటర్టైనర్‌గా, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీగా ఆసక్తి చూపుతున్నారు.

కూలీ – తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున , అమిర్ ఖాన్ , ఉపేంద్ర మరియు సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం మాస్ అటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే..! ఈ రెండు సినిమాలను చూసే ప్రేక్షకులకి సర్ ప్రైజ్ ప్లాన్ చేసాడు మన దర్శక ధీరుడు రాజమౌళి.

బాహుబలి పార్ట్ -1 మరియు పార్ట్ -2 మూవీస్ ని కంబైన్డ్ షార్ట్ చేసి బాహుబలి : ది ఎపిక్ (Baahubali: The Epic)గా రీ – రిలీజ్ చేస్తున్నామని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ బాహుబలి న్యూ వెర్షన్ టీజర్ ని కూలీ, వార్ 2 థియేటర్స్ లో చూపించబోతున్నారట.

నిజంగా ఇది ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..! ప్రభాస్ అభిమానులు ఈ అప్‌డేట్స్‌తో ఆనందంలో మునిగిపోయేలా ఉన్నారు.

Exit mobile version