War 2 Jr NTR Role: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి పెను ప్రభంజనాలను సృష్టించి సీఎంగా కూడా ఎదిగాడు. ఇక తన నట వారసుడి గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ వారసత్వపు ఆర ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు తర్వాత నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే మూడో తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవతరించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సక్సెసుల్లో ఉన్నాడు. ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందా? తద్వారా ఎన్టీఆర్ కెరియర్ లో వరుసగా 8వ విజయాన్ని దక్కించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ‘ త్రిబుల్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ ‘నాటు నాటు నాటు’ అనే పాటలో కావాలని రామరాజు (రామ్ చరణ్) క్యారెక్టర్ కింద పడిపోతే ఎన్టీఆర్ గెలుస్తాడు. మరి ఈ సినిమాలో కూడా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను గెలిపించే ప్రయత్నం చేస్తాడా? లేదంటే స్వతహాగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ను డామినేట్ చేసి తనే గెలుస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
Also Read: కూలీ మూవీ కోలీవుడ్ రివ్యూ…లాంగ్ రన్ లో ఈ సినిమా పరిస్థితి ఏంటో చెప్పేసిన క్రిటిక్స్…
మరి ఎన్టీఆర్ స్పై ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు అనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు హీరోగా అవతరిస్తారు. ఎవరు ఎవరిని డామినేట్ చేసి ముందుకు సాగుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ని కనక చూసినట్లయితే ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో ట్రైలర్ కట్ చేశారు.
మరి ఏదైన హాలీవుడ్ సినిమా ను తీసుకొచ్చి కాపీ చేసి సినిమా చేశారా అనే రేంజ్ లో అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాని చూస్తే గాని ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు. మరి హృతిక్ రోషన్ ను పూర్తిగా డామినేట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ తన నటన ప్రతిభను చూపించి బాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటాడా?
Also Read: రవితేజ స్టోరీ సెలెక్షన్ లో మార్పు ఉండదా..?
లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఇవన్నీ పక్కన పెడితే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను సెకండ్ హీరో అంటూ సంబోధిస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో కూడా ఆయన సెకండ్ హీరోగా కనిపిస్తాడా అలా కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తీవ్రమైన నిరాశ చెందుతారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు…