Guntur Kaaram: గుంటూరు కారం మూవీ ఫలితం పై మొదటి నుండి అనుమానాలే. కారణం… ఈ చిత్ర షూటింగ్ సవ్యంగా సాగలేదు. షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేశారన్నారు. అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ సాగలేదు. చిత్ర యూనిట్ మధ్య విబేధాలు, ప్రాజెక్ట్ ఆగిపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల మెయిన్ లీడ్ అయ్యింది. మీనాక్షి చౌదరి కొత్తగా యాడ్ అయ్యింది.
సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో హడావుడిగా చిత్రీకరణ పూర్తి చేశారన్నది నిజం. దీంతో మూవీ ఔట్ ఫుట్ పై అనుమానాలు ఉన్నాయి. ట్రైలర్ చూశాక ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. కొన్నాళ్లుగా దర్శకుడు త్రివిక్రమ్ కథల మీద పెద్దగా కసరత్తు చేయడం లేదు. కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే త్రివిక్రమ్ మార్క్ సెటైరికల్ కామెడీ జనాలు మిస్ అవుతున్నారు.
అతడు రేంజ్ కామెడీ సీన్స్ ఆయన నుండి మరలా రాలేదు. ఎమోషనల్ సీన్స్ పర్లేదు అనిపించినా అన్ని కథలు ఒకేలా అనిపిస్తున్నాయి. ఒక బలమైన లేడీ క్యారెక్టర్ చుట్టూ కథ రాసుకుంటున్నారు. అత్తారింటికి దారేది నుండి ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. గుంటూరు కారం కథ కూడా అలాంటిదే. ఇక్కడ రమ్యకృష్ణ పాత్ర కీలకం. ఆమె మహేష్ తల్లి రోల్ చేస్తున్నారు. అనుకోని కారణాలతో తల్లి నిరాదరణకు గురైన కొడుకుగా మహేష్ పాత్ర ఉండనుంది.
కాగా గుంటూరు కారం లో చెప్పుకోదగ్గ కథ ఉండే సూచనలు లేవు. రొటీన్ మేకింగ్ తో గుంటూరు కారం రూపొందించాడని అర్థం అవుతుంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ చేతులు ఎత్తేశాడు అంటున్నారు. గుంటూరు కారం చిత్రాన్ని మహేష్ మాత్రమే కాపాడాలి. అంతకు మించి చెప్పుకునే కొత్తదనం ఏమీ లేదంటున్నారు. మహేష్ మేనరిజం, వన్ లైనర్స్ మాత్రమే మెప్పించారు. శ్రీలీల గ్లామర్, ఎనర్జీ సెకండ్ థింగ్. కాబట్టి గుంటూరు కారం సక్సెస్ బాధ్యత మహేష్ దే అన్నమాట గట్టిగా వినిపిస్తోంది.