HomeతెలంగాణMedaram Jatara 2024: ఈ ఏడాది మేడారం మహాజాతర ఎప్పుడంటే?

Medaram Jatara 2024: ఈ ఏడాది మేడారం మహాజాతర ఎప్పుడంటే?

Medaram Jatara 2024: తెలంగాణ కుంభమేళాగా ప్రతిద్ధి చెందిన మేడారం సమ్మక్క – సారమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ జాతరను ఈసారి 2024, ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజు మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.

జాతర తేదీలు ఇవే..
మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈసారి పది నెలల ముందే ఖరారు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు తేదీలను ముందుగానే ప్రనకటించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.

ప్రకటనకు ముందు పూజలు..
మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు. మహా జాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీ ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు.

జాతర తేదీలు ఇవే..
ఫిబ్రవరి 21 : మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాక
ఫిబ్రవరి 22 : చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక.
ఫిబ్రవరి 23 : సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ.
ఫిబ్రవరి 24 : మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో మహా జాతర ముగింపు.
ఫిబ్రవరి 28 : మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజు తిరుగువారం పండుగ నిర్వహిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version