https://oktelugu.com/

Jabardasth Varsha: ఇమ్మాన్యుయేల్ కి భారీ షాక్ ఇచ్చిన వర్ష .. ప్రేమ విషయంలో నమ్మకద్రోహం!

ప్రస్తుతం జబర్దస్త్ షో కి గతంలో ఉన్నంత పాపులారిటీ లేదు. కామెడీ స్కిట్లు ఏదో అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని మల్లెమాల టీం నిర్ణయించుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2024 / 06:42 PM IST

    Jabardasth Varsha

    Follow us on

    Jabardasth Varsha: జబర్దస్త్ కామెడీ షో అంటే ఒకప్పుడు సూపర్ క్రేజ్ ఉండేది. జబర్దస్త్ కోసం బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ స్కిట్లు, పంచులు, కామెడీ మామూలుగా ఉండేది కాదు. అన్ని కామెడీ షోల్లో ది బెస్ట్ కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. కామెడీ తో పాటు లవ్ ట్రాక్ లు, డ్యూయెట్లు, పెళ్లిళ్ల స్కిట్లు బాగా ఫేమస్ అయ్యాయి. ఒకానొక సమయంలో జబర్దస్త్ పై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి షో ముందుకు దూసుకుపోయింది.

    కానీ ప్రస్తుతం జబర్దస్త్ షో కి గతంలో ఉన్నంత పాపులారిటీ లేదు. కామెడీ స్కిట్లు ఏదో అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని మల్లెమాల టీం నిర్ణయించుకుంది. కాగా ఇందుకోసం ఎపిసోడ్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ – రష్మీ తర్వాత బుల్లితెర లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్ – వర్ష ల కాంబినేషన్ తెర పైకి తెస్తున్నారు. ఈ జోడి ని ఆడియన్స్ బాగా ఆదరించారు. పైగా వర్ష – ఇమ్మాన్యుయేల్ రియల్ లైఫ్ లో కూడా జోడి అని భావించారు.

    కానీ వర్ష ఇమ్మాన్యుయేల్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్ ని కాదని వేరే కమెడియన్ ని పెళ్లి చేసుకుంది. పైగా ఇమ్ముని అన్నయ్య అని పిలిచింది. దీంతో ఇటు ఇమ్మాన్యుయేల్, అటు కమెడియన్ బాబు షాక్ అయ్యారు. కట్ చేస్తే .. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా నేను నీకోసం మంచి మంచి సంబంధాలు చూస్తుంటే అని ఇమ్మాన్యుయేల్ చెప్తాడు. మరో పక్క బాబు కూడా నీకోసం పెద్ద పెద్ద సంబంధాలు అనడంతో వర్ష నువ్వు తెచ్చిన సంబంధాలు చేసుకుంటే ఈ అన్నయ్యకు కోపం వస్తుందని, ఇమ్మానియేల్ ని ఉద్దేశించి అన్నది.

    దీంతో ఇమ్మాన్యుయేల్ తట్టుకోలేకపోయాడు. నువ్వు ఏమైనా అను, అన్న అని మాత్రం అనొద్దు, అలా పిలిస్తే చాలా కోపం వస్తుందని అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు వర్ష చేసుకున్న వాడి ఫ్యామిలీ లో భర్త అన్నయ్య .. ఇద్దరు ఎక్కడ ఉండాలో చర్చ జరిగింది. ఆరు నెలలు ఇద్దరు కలిసి ఉండొద్దని నిర్ణయించారు. దీంతో మండిపోయిన వర్ష మా ఇద్దరిని ఒకచోట ఉండనివ్వరా అంటూ రియాక్ట్ అవ్వడం నవ్వులు పూయించింది. ప్రోమోలో ఈ విషయాలు హైలెట్ గా నిలిచాయి.