Trivikram Srinivas : ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) ఏ హీరో తో పని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో గుంటూరు కారం విజయం సాధించక పోయినప్పటికీ, టీవీ టెలికాస్ట్ లో, ఓటీటీ స్ట్రీమింగ్ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఎలా ఫ్లాప్ చేసారు రా బాబు అని ఓటీటీ లో చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసేవారు. ఈ సినిమాతో త్రివిక్రమ్(Trivikram Srinivas) కి ఎలాంటి చెడ్డ పేరు రాలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు మన పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం అల్లు అర్జున్(Allu Arjun) తో ఉండబోతుంది, ఇది భారీ బడ్జెట్ చిత్రం, కార్తికేయ స్వామి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించబోయే సినిమా అంటూ ప్రచారం జరిగింది.
అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో చేయబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా ‘అజ్ఞాతవాసి’ సమయంలోనే ఫిక్స్ అయ్యింది. కానీ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారి నుండి ఆబ్లిగేషన్స్ రావడంతో ముందుగా వాళ్ళతో అరవింద సమేత, అలా వైకుంఠపురంలో వంటి సినిమాలు చేసాడు. అందువల్ల వెంకీ తో చేయాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు బోలెడంత సమయం దొరకడం తో వెంకటేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఉగాది లోపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన విక్టరీ వెంకటేష్, తన తదుపరి చిత్రం ఏది చేయాలి అనేదానిపై చాలా కసరత్తులు చేసాడు. సుమారుగా 20 కథలు విన్న వెంకటేష్ కి ఒక్క కథ కూడా సరిగా నచ్చలేదు. కానీ త్రివిక్రమ్ సబ్జెక్టు ఆయనకు బాగా నచ్చింది. ఒక భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే మరో భారీ ప్రాజెక్ట్ ని ఒప్పుకోవడం తో ఈ సినిమాకి అధికారిక ప్రకటన ముందే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి దింపే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక & హాసిని ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నారు.
Also Read : రాక్ టైటిల్ తో ఎన్టీఆర్ మూవీ? డైరెక్టర్ ఎవరంటే? బ్లాస్టింగ్ న్యూస్