https://oktelugu.com/

Mahesh Babu and Puri Jagannadh : మహేష్ బాబు, పూరి జగన్నాధ్ మధ్య ఏం జరిగింది..? వీళ్ళ కాంబో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారా..?

మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ఈ ఇద్దరి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు...పంచ్ డైలాగులు రాయడానికి క్రీఫ్ అడ్రస్ పూరి అయితే, వాటిని పర్ఫెక్ట్ టైమ్ లో డెలివరీ చేయగలిగే ఏకైక నటుడు మహేష్ బాబు...

Written By: , Updated On : February 17, 2025 / 02:35 PM IST
Mahesh Babu , Puri Jagannadh

Mahesh Babu , Puri Jagannadh

Follow us on

Mahesh Babu and Puri Jagannadh : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ఈ ఇద్దరి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు…పంచ్ డైలాగులు రాయడానికి క్రీఫ్ అడ్రస్ పూరి అయితే, వాటిని పర్ఫెక్ట్ టైమ్ లో డెలివరీ చేయగలిగే ఏకైక నటుడు మహేష్ బాబు…వీళ్లిద్దరూ కలిసారంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే…అలాంటి కాంబో మరోసారి సినిమా చేస్తే ఎలా ఉంటుంది… ఇలా ఇమాజిన్ చేసుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా…మరి వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా పూరి జగన్నాధ్ (Puri Jagannadh), మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. పోకిరి (Pokiri) సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగా, బిజినెస్ మేన్ (Bussines men) సినిమా మహేష్ బాబు కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలు నుంచి వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తే చూడాలని అటు మహేష్ బాబు అభిమానులు పూరి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీళ్ళ కాంబినేషన్ మాత్రమే సెట్ అవ్వడం లేదు. కారణం ఏదైనా కూడా వీళ్ళ కాంబో లో ఒక సినిమా వస్తే మాత్రం మరోసారి ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే పూరి జగన్నాధ్ రాసే ప్రతి డైలాగ్ మహేష్ బాబు కి చాలా బాగా సెట్ అవుతాయి. అలాగే మహేష్ బాబును భారీ రేంజ్ లో చూపించడం ఒక్క పూరి జగన్నాధ్ వల్లే అవుతుందనే విషయం మనందరికీ తెలిసిందే…

ఇక ‘ జనగణమన ‘ (Janaganamana) అనే సినిమా వీళ్ళ కాంబినేషన్లో వస్తుంది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్ చేసినప్పటికి అది పట్టాలెక్కలేదు. ఇక విజయ్ దేవరకొండ తో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని సీన్లను కూడా చిత్రీకరించారు. అయినప్పటికి లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది.

మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇతర దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి పూరి జగన్నాధ్ కూడా ఇప్పుడు ఈ సినిమాని మహేష్ బాబుతో చేస్తే బాగుండేది అనే ధోరణిలో వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా అయిపోయెంత వరకు వేరే సినిమాలు ఏవీ చేయడు.

అలాగే పూరి జగన్నాధ్ కి మహేష్ బాబు కి మధ్య ఈగో క్లాశేష్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. దానివల్ల వీళ్ళ కాంబినేషన్ అనేది పట్టాలెక్కలేదని కొంతమంది చెబుతూ ఉంటారు. మరి ఫ్యూచర్ లో అయిన వీళ్ళ కాంబినేషన్ ఒక్కసారైనా సెట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…