Trivikram: పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్న చాలా మంది గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న వారే. సక్సెస్ఫుల్ నటులు, దర్శకుల్లో తిండి, గూడు లేక ఇబ్బంది పడినవారు ఉన్నారు . స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, కమెడియన్ సునీల్ కూడా ఈ కోవకి చెందిన వారే. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. సునీల్ – త్రివిక్రమ్ ఒకే రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవారట. ఒకానొక సమయంలో భోజనం చేయడానికి కూడా డబ్బులు ఉండేవికావట.
ఆ సమయంలో రూమ్ రెంట్ కూడా కట్టలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నారట. రైటర్ గా త్రివిక్రమ్ క్లిక్ అయిన తర్వాత సునీల్ కి అవకాశాలు వచ్చేలా చేశాడు. సునీల్ స్టార్ కమెడియన్ గా ఎదగడానికి త్రివిక్రమ్ కృషి ఎంతగానో ఉంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో కూడా సునీల్ కి మంచి రోల్స్ రాశాడు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా, సునీల్ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: SSMB29: ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ కి ఎప్పుడు వెళ్తుందో చెప్పిన విజయేంద్ర ప్రసాద్…
ఆ రోజుల్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి త్రివిక్రమ్ ఓ సందర్భంలో పంచుకున్నారు. సునీల్ – త్రివిక్రమ్ లక్డికాపూల్ లో ఓ రూమ్ లో ఉండేవారట. రెంటు కట్టలేదని ఓనర్ గది ఖాళీ చేయమని అన్నాడట. త్రివిక్రమ్ కి సిగరెట్ అలవాటు ఉండేదట. రూ. 30 రూపాయలు ఉంటే రెండు సిగరెట్లు తాగాడట. ఇక మిగిలిన రూ. 28 రూపాయలతో రేపు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా చేయాలని సునీల్ ఆలోచిస్తున్నాడట.
Also Read: Devara: దేవర రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చిన మేకర్స్…పవన్ కళ్యాణ్ తో పోటీ పడటం అవసరమా..?
కాగా అప్పుడు మార్కెట్ లోకి కొత్తగా కూల్ డ్రింక్ టిన్ లు వచ్చాయట. త్రివిక్రమ్ మిగిలిన డబ్బుతో ఆ కూల్ డ్రింక్ టిన్ను కొనేశాడట. దీంతో సునీల్… ఉన్న కొంచెం డబ్బుతో కూల్ డ్రింక్ కొనేసావు, మరి రేపు తినడానికి ఏం చేయాలి అని త్రివిక్రమ్ ని అడిగాడట. రేపటి గురించి .. ఇప్పటి నుంచే ఆలోచిద్దాం .. అని త్రివిక్రమ్ చెప్పాడట. మనిషి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా బయపడకూడదు అని చెప్పడానికి త్రివిక్రమ్ ఈ సంఘటన గురించి చెప్పారు. అప్పుడు 28 రూపాయలు ఖర్చు చేయడానికి భయపడిన త్రివిక్రమ్, సునీల్ నేడు కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టారు. త్రివిక్రమ్ అయితే సినిమాకు రూ. 30 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు.